అంబానీ డబుల్ ధమాకా.. రిలయన్స్ రెండు ఐపీఓలు.. విలువ రూ. 17.50 లక్షల కోట్లు!

Wait 5 sec.

News: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ పెద్ద స్కెచ్చే వేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి రిలయన్స్ జియో ఐపీఓపైనా అంబానీ ప్రకటన చేశారు. ఇటీవల రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో . దీని విలువ సుమారు రూ. 13.5 లక్షల కోట్లు ఉండొచ్చని తెలిసింది. ఇప్పుడు అంబానీ సంస్థ నుంచి మరో ఐపీఓ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ తన రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ ఐపీఓను కూడా తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ రిటైల్ ఐపీఓను 2027లో పబ్లిక్‌లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జియో ఐపీఐ వచ్చిన ఏడాదిలోపు రిటైల్ ఐపీఓను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని హిందూ బిజినెస్‌లైన్ రిపోర్ట్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి సమాచారం తెలిసిన వారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఉంటుందని తెలిసింది. భారత కరెన్సీలో చూస్తే ఇది ఏకంగా రూ. 17.50 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. >> ఇంత విలువైన సంస్థలో చాలా తక్కువ శాతం షేర్లను ఐపీఓ కోసం తీసుకొచ్చినప్పటికీ.. దేశంలోని అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా అవతరిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు దేశంలో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అతిపెద్ద ఐపీఓగా ఉంది. ఈ ఏడాది రానున్న టాటా క్యాపిటల్ ఐపీఓ రెండో అతిపెద్దదిగా అవతరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు రూ. 17 వేల కోట్ల నిధుల్ని సమీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఓ సన్నాహాల్లో భాగంగానే.. రిలయన్స్ తన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ వ్యాపార విభాగం అయిన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్‌ను విభజించింది. ఇప్పుడు ఇది రిలయన్స్ రిటైల్‌కు కాకుండా.. నేరుగా పేరెంట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రత్యక్ష అనుబంధ సంస్థగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. మార్జిన్లను పెంచుకునేందుకు వీలుగా అంతగా పెర్ఫామెన్స్ చేయని అవుట్‌లెట్స్‌ను మూసేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కోసం.. సింగపూర్ జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కేకేఆర్, టీపీజీ, సిల్వర్ లేక్ వంటివి తమ వాటాల్ని విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఇవి పెట్టుబడిదారులుగా పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉందని సమాచారం.