ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది. ఇదే విషయాన్ని మ్యాచ్ రిఫరీ కూడా సపోర్ట్ చేశాడు. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని ఆశ్రయించింది. తొలుత ఈ పాక్ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ చివరికి ఈ విషయంలో యూ టర్న్ తీసుకుంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్‌ను పాక్ మ్యాచ్‌ల నుంచి తప్పించింది. దాంతో బుధవారం జరిగే యూఏఈ - పాక్ లీగ్ మ్యాచ్‌కు కొత్త రిఫరీగా వెస్టిండీస్ లెజెండ్ రిచీ రిచర్డ్స్‌ను ఐసీసీ నియమించింది. మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ వివాదం రగిలిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు గౌరవంగా పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా నిలిచారు. దీని తర్వాత పాక్ బోర్డు రిఫరీ పైక్రాఫ్ట్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తి, ఆయనను తప్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ మొదట ఆ డిమాండ్‌ను తిరస్కరించి, వసీమ్ ఖాన్ సంతకం చేసిన లేఖను పీసీబీకి పంపింది. వసీమ్ ఖాన్ గతంలో పాక్ క్రికెట్ బోర్డులో పనిచేయడం విశేషం.పుల్‌అవుట్ చేస్తే 16 మిలియన్ డాలర్ల భారీ నష్టం తప్పదని స్పష్టమయ్యాకే పీసీబీ వ్యూహం మారింది. అదే సమయంలో పాకిస్తాన్ మీడియా, రాజకీయ ఒత్తిడి కూడా పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ తుది నిర్ణయంగా మధ్యస్థ పరిష్కారానికి వెళ్లి, రిఫరీని మార్చడం ద్వారా పీసీబీకి ఫేస్‌ సేవర్ ఇచ్చింది.ఈ పరిణామం పాకిస్తాన్‌కు స్పష్టమైన విజయంలా కనిపిస్తున్నప్పటికీ, ఐసీసీ నిర్ణయాలపై స్వతంత్రత, పారదర్శకతపైన అనుమానాలు మళ్లీ తలెత్తాయి. మొదట తిరస్కరించిన డిమాండ్‌పై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.యూఏఈ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినా, చివరి నిమిషంలో దాన్ని రద్దు చేయడం కూడా పీసీబీ నిస్సహాయతను బహిర్గతం చేసింది. “బహిష్కరణపై ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడం లేదు” అని బోర్డు వర్గాలు లోపలే చర్చించుకున్నట్లు సమాచారం. ఆసియా కప్‌లో పాకిస్తాన్ భవిష్యత్తును ఈ యూఏఈ మ్యాచ్ నిర్ణయించనుంది. ఇక ఐసీసీతో తలెత్తిన ఈ విభేదాలు మైదానంలో జట్టు ప్రదర్శనపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.