in Hyderabad: సామాన్యులకు బంగారం మరింత దూరమవుతోంది. రోజురోజుకూ రేట్లు పెరుగుతూ పోతూనే ఉన్నాయి. గత . ఈ క్రమంలో స్వల్పంగా తగ్గాయి. అయితే ఇంకా తగ్గుతాయనుకుంటే మరోసారి షాక్ ఇచ్చాయి. ఇవాళ భారీగా పెరగడంతో మళ్లీ రికార్డు స్థాయి గరిష్టాలకు చేరాయి. దేశీయంగా బంగారం రేట్లు భారీగా పెరగ్గా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ఫ్లాట్‌గానే ట్రేడవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇవాళ సమావేశం కానుంది. వడ్డీ రేట్లకు సంబంధించి.. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇది బంగారం ధరల భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. గతేడాది ఫెడ్ వరుసగా వడ్డీ రేట్లను తగ్గించగా.. ఈ ఏడాదిలో మాతం ఇప్పటివరకు కీలక వడ్డీ రేట్లను తగ్గించకుండా స్థిరంగానే ఉంచుతూ వచ్చింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని ఫెడ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈసారి కచ్చితంగా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే బంగారం ధర ఇంకా అడ్డూఅదుపు లేకుండా పెరగొచ్చని అనుకుంటున్నారు. >> ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే ఫ్లాట్‌గానే ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3680 డాలర్ల స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు ఒడుదొడుకుల్లో ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ప్రస్తుతం సరిగ్గా 42 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కాస్త పుంజుకుంది. ప్రస్తుతం రూ. 88.10 వద్ద ఉంది. >> దేశీయంగా బంగారం రేట్లు మళ్లీ రికార్డు స్థాయిలో ఎగబాకాయి. దీంతో మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాాకాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 800 పెరగడంతో తులం ప్రస్తుతం రూ. 1,02,600 వద్ద ఉంది. దీనికి ముందు 3 రోజుల్లో రెండు సార్లు రూ. 100 చొప్పున తగ్గుముఖం పట్టింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై రూ. 870 పెరిగి రూ. 1,11,930 కి చేరింది. ఇదే ఢిల్లీలో చూస్తే బంగారం ధర 22 క్యారెట్లు, 24 క్యారెట్లపై వరుసగా రూ. 1,02,750; రూ. 1,12,080 గా ఉన్నాయి. వెండి ధర కూడా కొంత కాలంగా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగారాన్ని మించి పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ఒక్కరోజే రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ. 1.44 లక్షలకు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ. 1.34 లక్షల వద్ద ఉంది.