తెలంగాణలో వర్షాలు మళ్లీ ఉధృతంగా కురిసే అవకాశం ఉందని చేసింది. సెప్టెంబర్ 17వ తేదీన ఉత్తర పడతాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ ప్రాంతంలోని మరొక వాతావరణ వ్యవస్థ కలిసిపోవడంతో వర్షపాతం పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. హైదరాబాద్ సహా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకొని జోరుగా వర్షం కురిసే పరిస్థితులు నెలకొంటాయి. క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో సాయంత్రం గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తల విషయానికి వస్తే.. వర్షాలు ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. వర్షాల సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్, ఓపెన్ వైరింగ్ దగ్గర నిలబడరాదు. వాహనదారులు తక్కువ వేగంతో ప్రయాణించాలి. లోతట్టు ప్రాంతాలు, నదీ వాగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను నీటి మడుగుల దగ్గర ఆడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక జాగ్రత్తలు.. అలాగే, వర్షాల సమయంలో రోడ్లపై జారి పడే ప్రమాదం ఉన్నందున వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాల ప్రభావం వరుసగా రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అధికారుల సూచనలు పాటించడం ద్వారా ముప్పులను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా.. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని.. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపల వేటకు వెళ్లే వారు తమ వేటను వాయిదా వేసుకోవాలని సూచించారు.