ట్రంప్ ఒక్క సంతకంతో.. టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌కు పెద్ద దెబ్బ.. కోలుకోవడం కష్టమే..

Wait 5 sec.

: భారతీయులకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇది దిగ్గజ ఐటీ కంపెనీలకు పెను సవాలుగా మారింది. సాధారణంగా.. అమెరికాలోని కంపెనీలు.. విదేశాల నుంచి నిపుణుల్ని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు H1B వీసా జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ఉద్యోగిపై ఇదివరకు 1000 డాలర్లు (రూ. 88 వేల వరకు) చెల్లించగా.. అంటే ఇప్పుడు ఒక్కో ఉద్యోగిపై ఏకంగా రూ. 88 లక్షలకుపైనే ఏడాదికి చెల్లించాల్సి వస్తుంది. ఇది అమెరికా కేంద్రంగా పనిచేసే.. భారత దిగ్గజ ఐటీ కంపెనీల లాభాలకు గండి కొట్టనుంది. పూర్తి వివరాలు చూద్దాం. >> యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIA) డేటా ప్రకారం చూస్తే.. 2025 ఏడాదిలో భారత 5 ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కలిపి 13,396 హెచ్1 వీసాల్ని ఇచ్చాయి. టీసీఎస్ అత్యధికంగా 5,364 వీసాలు జారీ చేయగా.. కాగ్నిజెంట్ (2,493), ఇన్ఫోసిస్ (2004), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (1807), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (1728) వీసాలతో వరుసగా ఉన్నాయి. అంతకుముందు . ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 118 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు వీసా వార్షిక ఫీజు పెంపుతో చూస్తే 1.34 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 11 వేల కోట్లకుపైనే) అవుతుంది. అంటే ఒక్కో కంపెనీపై అదనంగా భారీగా భారం పడుతుందని చెప్పొచ్చు. ఈ 5 కంపెనీల మొత్తం నికర లాభం.. కిందటి ఆర్థిక సంవత్సరంలో 13.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 1.20 వేల కోట్ల వరకు ఉంటుంది. అంటే.. వీసా ఫీజు పెంపుతోనే ఆయా కంపెనీల లాభాల్లో దాదాపు 10 శాతం వరకు కరిగిపోనుంది. దీంతో.. భారత దిగ్గజ ఐటీ కంపెనీలు.. తమ వ్యాపార వ్యూహాల్ని మార్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వీటిని తగ్గించే అవకాశం ఉంది. భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా .. ట్రంప్ నిర్ణయాలతో ఎప్పటినుంచో హెచ్1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించాయని.. అమెరికన్ కంపెనీలే ఇప్పుడు అతిపెద్ద స్పాన్సర్లుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిబంధనల వల్ల యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు.