ఆ విద్యార్థులకు అలర్ట్.. టైం టేబుల్లో కీలక మార్పులు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కొత్త టైమ్ టేబుల్‌ను ప్రవేశపెట్టింది. పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల సమయంలో సాధారణంగా సెలవులు ఉంటాయి. ఆ సమయంలో స్కూల్స్ కాలేజీలు ఉండవు కాబట్టి.. ఈ రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో సమయ పట్టికను ఖచ్చితంగా అమలు చేయాలని మైనారిటీ శాఖ కార్యదర్శి షఫి ఉల్లా ఆదేశాలు జారీ చేశారు. కొత్త షెడ్యూల్‌ను మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. అందులో ఒకటి ప్రీ క్లాస్ రూమ్ కార్యకలాపాలు.. రెండోది క్లాస్ రూమ్ సెషన్లు, మూడోది పోస్ట్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. ఈ విధానం ద్వారా విద్యార్థుల రోజువారీ జీవితంలో క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు.. సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. గురుకుల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్. అజయ్ కుమార్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్ ప్రకటన చేస్తూ.. ఈ మార్పు వల్ల విద్యార్థులు మరింత ప్రయోజనం పొందుతారని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఈ నిర్ణయాన్ని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్త టైమ్ టేబుల్ విద్యార్థుల్లో శ్రద్ధ, క్రమశిక్షణ, జ్ఞానపరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో దోహదం చేస్తుందని.. ప్రీ క్లాస్ కార్యకలాపాల ద్వారా విద్యార్థులు మానసికంగా సిద్ధం అవుతారు... క్లాస్ రూమ్ సమయంలో పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారని వారి అభిప్రాయం. ఇక పోస్ట్ క్లాస్ యాక్టివిటీస్ ద్వారా స్వీయపఠనానికి, చర్చలకు అవకాశం లభిస్తుంది. ఈ విధంగా విద్యా విధానంలో సమతుల్యం నెలకొని.. విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ మార్పులు మైనారిటీ విద్యాసంస్థల అభివృద్ధికి పునాది వేస్తాయని.. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలకు దోహదం చేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల శ్రద్ధ, చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.