బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే 15 శాతం పెరిగిన జువెలరీ స్టాక్.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం

Wait 5 sec.

Jewellery Stock: బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో పసిడి మార్కెట్‌తో సంబంధం ఉన్న కంపెనీల స్టాక్స్ రాణిస్తున్నాయి. ఈరోజు ట్రేడింగ్ సెషన్ గమనిస్తే ప్రముఖ జువెలరీ కంపెనీ పీసీ జూవెలర్ లిమిటెడ్ () సంస్థ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. ఒకానొక సమయంలో 15 శాతం మేర పెరిగి రూ. 15.38 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకాయి. ఆ తర్వాత లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి తగ్గాయి. బంగారం ధరలు భారీగా పెరుగడంతో పాటు ఈ కంపెనీ కంపెనీ కొత్త షోరూమ్ ప్రారంభిస్తున్నామని ప్రకటించడం, క్యూ1లో మెరుగైన ఫలితాలు ప్రకటించడం ఈ స్టాక్ ర్యాలీ చేసేందుకు కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సంస్థ రుణ భారం సైతం తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం బంగారం మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌లో ఉంది. దీంతో ఈ స్టాక్ తమ ఇన్వెస్టర్లకు కాసుల కురిపిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పీజీ జువెలర్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 807.88 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. కంపెనీ నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 161.93 కోట్లు నమోదైంది. రానున్న కొద్ది కాలంలోనే తమ స్టోర్ల సంఖ్యను పెంచి వ్యాపారం విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీలోని కపిల్ విహార్ ప్రాంతంలో అతి త్వరలో కొత్త షోరూమ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.దీంతో రాణిస్తోంది. బ్రోకరేజీ సంస్థలు సైతం బై రేటింగ్ ఇస్తున్నాయి. కొత్త టార్గెట్ ధరలు సూచిస్తున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో పీసీ జువెలర్స్ స్టాక్ రూ.13.47 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఓ సమయంలో ఇంట్రాడే హై స్థాయి రూ.15.38ని తాకి ఆ తర్వాత వెనక్కి దిగివచ్చింది. మార్కెట్లు ముగిసేనాటికి రూ.14.70 వద్దకు చేరింది. 52 వారాల గరిష్ఠ ధర రూ.19.65, కనిష్ఠ ధర రూ.10.28 వద్ద ఉన్నాయి. గత వారంలో 11 శాతం మేర లాభాలు ఇచ్చింది. గత ఆరు నెలల్లో 5 శాతం పెరిగింది. గత ఏడాదిలో 3 శాతం నష్టపోయింది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో మాత్రం ఈ స్టాక్ 873 శాతం మేర లాభాలు ఇచ్చింది. లక్ష పెట్టిన వారికి రూ. 9 లక్షలకు పైగా అందించింది.