రూ. 5 వేలకే శిర్డీ యాత్ర.. IRCTC బంపరాఫర్.. కాచిగూడ నుంచి ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..

Wait 5 sec.

Offers: ఇప్పుడసలే పండగ సీజన్. సెలవులు వస్తుంటాయి. అలా కుటుంబంతో సరదాగా ఎటైనా వెళ్లాలనుకుంటున్నారా.. ఆధ్యాత్మిక ప్రదేశాల్ని చుట్టి రావాలనుకుంటున్నారా. అయితే మీకో బంపరాఫర్. ఇటీవలి కాలంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇలా ప్రత్యేక ప్యాకేజీల్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. దీనిని సాయి సన్నిధి పేరిట తీసుకొచ్చింది. ఈ ట్రిప్‌కు మీరు వెళ్లాలంటే.. సెప్టెంబర్ 24- నవంబర్ 12 మధ్య టికెట్లు అందుబాటులో ఉన్నాయి.ఈ ట్రైన్ ప్రతి బుధవారం కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగే స్టేషన్ల విషయానికి వస్తే.. మేడ్చల్, బాసర, మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక్కడ స్టాండర్డ్, కంఫర్ట్ అనే 2 రకాల ప్యాకేజీలు ఉంటాయి. కంఫర్ట్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్ అయితే.. స్లీపర్ బెర్త్ కేటాయిస్తారు.బుధవారం సాయంత్రం 6.40 గంటలకు కాచిగూడలో 17064 (అజంతా ఎక్స్‌ప్రెస్) ట్రైన్ ప్రారంభమవుతుంది. ప్రయాణం రాత్రంతా ఉంటుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు.. మీరు నాగర్సోల్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని ఐఆర్సీటీసీ సిబ్బంది.. శిర్డీలోని ముందుగా మీ కోసం ఏర్పాటు చేసిన హోటల్‌కు తీస్కెళ్తారు. అక్కడి నుంచి శిర్డీ ఆలయానికి వెళ్తారు. దర్శనం టికెట్ ప్యాకేజీలో భాగంగా ఉండదు. మీరు వేరే అక్కడ కొనుగోలు చేయాలి. దర్శనం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు.. చెక్ అవుట్ చేయాలి. తిరిగి ప్రయాణం అయ్యేందుకు నాగర్‌సోల్ స్టేషన్ చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు.. 17063 ట్రైన్ ప్రారంభమవుతుంది. ప్రయాణం రాత్రంతా చేయాలి. మూడో రోజు ఉదయం 9.45 గంటలకు ట్రైన్ కాచిగూడ స్టేషన్ చేరుకుంటుంది. ఛార్జీల వివరాలు ఇలా..కంఫర్ట్‌లో అయితే థర్డ్ ఏసీ కింద ఒక్కో ప్రయాణికుడు సింగిల్ షేరింగ్ రూమ్ కోసం రూ. 7890, డబుల్ షేరింగ్ కోసం రూ. 6660 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్ రూ. 6640 చెల్లించాలి. చిన్నారులకు 5-11 ఏళ్ల మధ్య వారికి విత్ బెడ్ అయితే రూ. 5,730; వితౌట్ బెడ్ అయితే రూ. 5420 చెల్లించాలి. ఇదే స్టాండర్డ్ విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ కోసం ఒక్కో ప్రయాణికుడు రూ. 6220 చెల్లించాలి. డబుల్ షేరింగ్ కింద రూ. 4,980 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్ కోసం రూ. 4,960 పడుతుంది. చిన్నారులకు అయితే ఇక్కడ రూ. 4 వేలు, అంతకంటే తక్కువే ఉంది. ప్యాకేజీలో భాగంగా.. మీ ప్రయాణానికి ఏసీ వాహనం ఉంటుంది. శిర్డీలో ఉండేందుకు వసతి కల్పిస్తారు. అల్పాహారం సదుపాయం ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. టోల్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. మధ్యాహ్న, రాత్రి భోజనాలు యాత్రికులే చూసుకోవాలి. చూడాలి.