పార్టీలో ఓ నామినేటెడ్ పదవి చిచ్చు రేపింది. దీంతో నేరుగా అధినేత పవన్ కళ్యాణ్‌కే లేఖాస్త్రాలు సంధిస్తున్నారు అక్కడి నేతలు. అసలు విషయంలోకి వస్తే ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను విడతల వారీగా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ల నుంచి ఆలయాల కమిటీల ఛైర్మన్ల వరకూ చాలా పదవులను భర్తీ చేశారు. మూడు పార్టీలు సమన్వయంతో నామినేటెడ్ పదవులను పంచుకున్నాయి. అయితే ఎంపిక వ్యవహారం మాత్రం జనసేనలో చిచ్చు రేపింది. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి జనసేన పార్టీలో వివాదం రేపింది. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టే సాయి ప్రసాద్‌ను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోట వినూత రాసిన బహిరంగ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ కోట వినూత లేఖలో స్పష్టం చేశారు.శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డ్ ఛైర్మన్ పదవిని కొట్టే సాయి ప్రసాద్‌కు ఇవ్వడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. మహిళలంటే కనీస గౌరవం లేని అలాంటి వ్యక్తికి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని కోట వినూత లేఖలో పేర్కొన్నారు. లో కొట్టే సాయి ప్రసాద్‌కు కూడా భాగం ఉందని.. ప్రధాన వ్యక్తులలో అతనొకరని కోట వినూత ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి, నాదెండ్ల మనోహర్‌కు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌కు, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌కు వివరించడ జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తనకు జరిగిన సమస్య పవన్ కళ్యాణ్‌ వరకూ చేరలేదేమోనని కోట వినూత లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారన్న కోట వినూత.. అర్హులైన వారిని గుర్తించి ఆలయ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయాలని కోరారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఆలయ ఛైర్మన్ బాధ్యతలు ఇవ్వడం సరికాదన్న కోట వినూత.. పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానంటూ కోట వినూత బహిరంగ లేఖ విడుదల చేశారు. మరోవైపు హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొట్టే సాయి ప్రసాద్‌.. గతంలో ఓసారి వార్తల్లో వైరల్ అయ్యారు. వైసీపీ హయాంలో జనసేన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న కొట్టే సాయిని అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బ కొట్టడం అప్పుట్లో నెట్టింట వైరల్ అయ్యింది. అనంతరం పవన్ కళ్యాణ్ కూడా కొట్టే సాయిని పరామర్శించారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఆయనకు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.