పెళ్లైన 14 నెలల్లోనే విడాకులు కోసం దరఖాస్తు చేసిన ఓ వివాహిత.. తనకు భరణంగా రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం కోసం పట్టుబడితే చాలా కఠినమైన తీర్పు తప్పదని జస్టిస్ జేబీ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. అమెజాన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తోన్న ఆమె భర్త.. భరణంగా రూ.35 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ, ఆ మహిళ మాత్రం రూ.5 కోట్లు ఇస్తేనే విడాకుల పత్రంపై సంతకం పెడతానని పట్టుబట్టింది. అయితే, మహిళ తరపు న్యాయవాది భర్త తరపు లాయర్ వాదనలను తోసిపుచ్చారు. మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ మొత్తాన్ని తగ్గించారని చెప్పారు.ఈ సందర్భంగా జస్టిస్ పార్దివాలా భర్త తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆమెను వెనక్కి పిలిచి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు.. ఆమెను ఆపలేరు... ఆమె కలలు చాలా పెద్దవి’’ అని వ్యాఖ్యానించారు. రూ.5 కోట్లు కావాలనే డిమాండ్ అమోదయోగ్యం కాదని, అలాంటి వైఖరి ప్రతీకూల తీర్పును ఆహ్వానించడమేనని అన్నారు. గతవారం ఓ జంట విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి సర్దుబాటు చర్చల కోసం దంపతులు ఇద్దరూ సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి రావాలని అల్టమేటం జారీచేసింది. ఇదే సమయంలో చేస్తే ప్రతీకూల తీర్పు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది.‘‘14 నెలల కిందటే వివాహం చేసుకుని... ఏడాది పాటే దాంపత్య జీవితం కొనసాగించిన ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకుంది.. వివాహ బంధం రద్దు కోసం భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్ుట మాకు సమాచారం ఉంది... భార్య ఇలాంటి పట్టుదలతో కొనసాగితే ఆమెకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వాల్సి రావచ్చు. కదా? ఈ వివాదానికి ముగింపు పలికేలా తగిన, సబబైన డిమాండ్లు భార్య పెట్టాలని మేము ఆశిస్తున్నాం’ అని జస్టిస్ పార్థీవాలా అన్నారు. ఇక, ఇరువర్గాలు అక్టోబర్ 5న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం ముందు హాజరు కావాలని ఆయన ఆదేశించారు.