పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతకు మళ్లీ ఇంఛార్జి బాధ్యతలు.. సస్పెన్షన్ ఎత్తేసి మరీ..!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇంఛార్జి పదవి నుంచి తప్పించడమే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన ఓ నేతను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అలాగే పార్టీ ఇంఛార్జిగా నియమించారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఇంఛార్జిగా అత్తి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునర్నియమించారు. అత్తి సత్యనారాయణ మీద ఉన్న సస్పెన్షన్ తొలగించి.. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా తిరిగి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో అత్తి సత్యనారాయణ మీద తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లోవచ్చాయిఇక అప్పట్లో ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉందనే ఆరోపణలతో ఆయనను జనసేన ఇంఛార్జి పదవి నుంచి తప్పించారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.అత్తి సత్యనారాయణ మీద వచ్చిన ఆరోపణలు నిజమా, లేదా అవాస్తవాలా అని నిరూపించుకునేవరకూ తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే తాజాగా అత్తి సత్యనారాయణ మీద సస్పెన్షన్ ఎత్తి వేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అలాగే అతనికి ఇంఛార్జి పదవి తిరిగి అప్పగించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలోనే జనసేన ఇంఛార్జి పదవుల నుంచి తప్పించిన మిగతా వారిని తిరిగి తీసుకోవాలని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. కొవ్వూరు ఇంఛార్జి పదవి నుంచి టీవీ రామారావును తప్పించిన జనసేన అధిష్టానం.. పార్టీ విధివిధానాలను ఉల్లంఘించారనే కారణాలుగా పేర్కొంది. అలాగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది. కూటమి పార్టీల ఐక్యతకు, పార్టీ గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని అప్పట్లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే తాజాగా అత్తి సత్యనారాయణ మీద సస్పెన్షన్ వేటును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో టీవీ రామారావుపైన విధించిన సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని.. ఇంఛార్జిగా తిరిగి నియమించాలనే డిమాండ్లు ఆయన మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.