: జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 (సోమవారం) నుంచే అమల్లోకి వస్తున్నాయి. దీంతో దాదాపు . నిత్యావసరాల సరకుల నుంచి మొదలుకొని, కార్లు, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్స్, టీవీ, బైక్స్, కార్లు ఇలా అన్నింటి ధరలు తగ్గుతున్నాయి. ఇక 12, 28 శాతం శ్లాబుల్ని ఎత్తేయగా.. అవి తక్కువ శ్లాబు పన్ను రేట్లలోకి వచ్చేశాయి. 12 శాతం శ్లాబులో ఉన్న దాదాపు 99 శాతం వస్తువుల్ని 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు. ఇంకా 28 శాతం శ్లాబులో ఉన్న 90 శాతం వస్తువుల్ని.. 18 శాతం శ్లాబులోకి తెచ్చారు. అయితే.. ఇక్కడే మరో గుడ్‌న్యూస్ ఉంది.దాదాపు 50 కిపైగా ప్రొడక్ట్స్‌పై ఇక మీదట జీరో జీఎస్టీ ఉండనుంది. అంటే వీటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించారన్నమాట. ఇందులో నిత్యావసరాలు సహా ప్రాణాధార, కీలక ఔషధాలు, స్టేషనరీ సామగ్రి, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటివి ఉన్నాయి. దీంతో వీటి ధరలు మరింత చవకగా మారనున్నాయి. జీఎస్టీ చెల్లించాల్సిన పనే లేదు. ఇక మీదట.. సామాన్యులు తమ చేతిలో ఎక్కువ నగదు ఆదా చేసుకోవచ్చు. వీటి ఫుల్ లిస్ట్ చూద్దాం. పాలు, బ్రెడ్..అల్ట్రా హై టెంపరేచర్ (UHT) మిల్క్ప్రీప్యాకేజ్డ్ & లేబుల్డ్ చీనా లేదా పనీర్ఇండియన్ బ్రెడ్స్, చపాతీ, రోటీ, పరాటాపిజ్జా బ్రెడ్ఖాఖ్రాఇప్పటికే పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల ధరల్ని తగ్గిస్తున్నట్లు మదర్ డెయిరీ, హెరిటేజ్ ఫుడ్స్, అమూల్, పతంజలి వంటి సంస్థలు ప్రకటించేశాయి. వాటి కొత్త ధరల్ని కూడా ప్రకటించాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్,..33 నిత్యావసరాల ఔషధాలపై ఎలాంటి సుంకం పడదు.క్యాన్సర్ ట్రీట్మెంట్‌ సహా ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు వినియోగించే కీలక ఔషధాలుస్టేషనరీ వస్తువులు (స్కూల్, ఆఫీసుల్లో వాడేవి)..మ్యాప్స్ చార్ట్స్ గ్లోబ్స్ పెన్సిల్స్, షార్ప్‌నర్స్, ఎరేజర్స్క్రేయాన్స్ప్యాస్టెల్స్నోట్ బుక్స్ఎక్సర్‌సైజ్ బుక్స్రైటింగ్, డ్రాయింగ్ చాక్స్, టైలర్స్ చాక్స్, చాక్ స్టిక్స్డ్రాయింగ్ ఛార్‌కోల్స్మరో ప్రధానమైనది.. . ఇది గతంలో ఏకంగా 18 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరో శ్లాబులోకి మార్చకుండా.. ఏకంగా జీరో చేసేశారు. దీంతో ఇక జీఎస్టీ లేకుండానే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడే పలు సంస్థలు.. ప్రీమియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.