: దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ వారం పలు కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల ప్రొడక్ట్ బాస్కెట్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు న్యూ ఫండ్ ఆఫర్‌తో వస్తున్నాయి. ఈ వారం మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం 7 కొత్త పథకాలు లాంచ్ అవుతున్నాయి. అందులో రెండు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, రెండు ఈటీఎఫ్ ఫండ్స్, ఒక లిక్విడ్ ఫండ్, ఒక థెమాటిక్ ఫండ్, ఒక ఆర్బిట్రేజ్ ఫండ్ వంటివి ఉన్నాయి. కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు అందుకోవాలని అనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరి ఏ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఎలాంటి స్కీమ్ తీసుకొస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ పేరుతో ఈ స్కీమ్ సెప్టెంబర్ 23 న సబ్‌స్క్రిప్షన్ మొదలు పెడుతోంది. అక్టోబర్ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వస్తోంది. వెల్త్ కంపెనీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ సెప్టంబర్ 24వ తేదీన మొదలై అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈటీఎఫ్ కేటగిరీలో రెండుకోటక్ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఈటీఎఫ్ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 22వ తేదీన మొదలవుతోంది. అక్టోబర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక డీఎస్‌పీ నిఫ్టీ 500 ఫ్లెక్సీ క్యాప్ క్వాలిటీ 30 ఈటీఎఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 25వ తేదీన మొదలై అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. లిక్విడ్ ఫండ్ది వెల్త్ కంపెనీ లిక్విడ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 24వ తేదీన మొదలవుతుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు జరిగాక క్రయ విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. థెమాటిక్ ఫండ్అక్టోబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లకు యూనిట్లు కేటాయింపు చేసిన తర్వాత మళ్లీ క్రయ విక్రయాలకు ఓపెన్ మార్కెట్లో అందుబాటులోకి తెస్తారు. ఆర్బిట్రేజ్ ఫండ్ఆర్బిట్రేజ్ ఫండ్ కేటగిరీలోనూ ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్ తెస్తోంది. ది వెల్త్ కంపెనీ ఆర్బిట్రేజ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 24వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది.