Car Price Discounts: దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో.. కొత్త కార్లు కొనాలనుకునే వారికి అతిపెద్ద శుభవార్త. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా.. జీఎస్టీని కేంద్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. రేట్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే జీఎస్టీ ప్రయోజనాల్ని.. కస్టమర్లకు అందించనున్నట్లు దిగ్గజ కార్ మేకర్స్ ప్రకటించగా.. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 అంటే నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంకా పండగ సీజన్ నేపథ్యంలో.. చాలా కంపెనీలు ఇతర డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మనం మారుతీ సుజుకీ, కియా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వీటిల్లో ఏయే మోడల్‌పై ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం. . ఇక్కడ పండగ సీజన్ నేపథ్యంలో.. జీఎస్టీ రేట్ల కోతకు మించి కొన్ని మోడళ్లపై ధరల్ని తగ్గించింది. ఆల్టో కే10, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఎస్- ప్రెస్సో వంటివి ఇందులో ఉన్నాయి. ఇకడ రూ. 46,400 నుంచి రూ. 1,29,600 వరకు ధరలు తగ్గాయి. కియా ఇండియా విషయానికి వస్తే.. తన మోడల్స్‌పై గరిష్టంగా రూ. 4.48 లక్షల వరకు ధరల్ని తగ్గించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలు రూ. 1.56 లక్షల వరకు తగ్గాయి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. ఇక్కడ సెస్ తొలగించగా.. . ఇప్పుడు మనం ఫుల్ లిస్ట్ చూద్దాం. ఆటోమేకర్- మోడల్- గరిష్టంగా తగ్గిన ధర ఇలా చూద్దాం.మారుతీ సుజుకీ.. ఎస్ ప్రెస్సో - రూ. 1,29,600ఆల్టో కే10- రూ. 1,07600స్విఫ్ట్- రూ. 84,600డిజైర్- రూ. 87,700బ్రెజా- రూ. 1,12,700ఫ్రాంక్స్- రూ. 1,12,600గ్రాండ్ విటారా- రూ. 1,07000 ఎర్టిగా- రూ. 46,400కియా..సొనెట్- రూ. 1,64,471సైరస్- రూ. 1,86,003సెల్టోస్- రూ. 75,372క్యారెన్స్- రూ. 48,513క్యారెన్స్ క్లావిస్- రూ. 78,674కార్నివాల్- రూ. 4,48,542మహీంద్రా..బొలెరో నియో- రూ. 1.27 లక్షలు తగ్గింది. XUV 3XO పెట్రోల్- రూ. 1.40 లక్షలుXUV 3XO డీజిల్- రూ. 1.56 లక్షలుథార్ రేంజ్- రూ. 1.35 లక్షలుథార్ రాక్స్- రూ. 1.33 లక్షలుస్కార్పియో క్లాసిక్- రూ. 1.01 లక్షలుస్కార్పియో- ఎన్- రూ. 1.45 లక్షలుXUV 700 - రూ. 1.43 లక్షలుటాటా మోటార్స్..టియాగో- రూ. 75 వేలుటిగోర్- రూ. 80 వేలుఆల్ట్రోజ్- రూ. 1.10 లక్షలుపంచ్ - రూ. 85 వేలునెక్సాన్- రూ. 1.55 లక్షలుహ్యారియర్- రూ. 1.40 లక్షలుసఫారీ- రూ. 1.45 లక్షలుకర్వ్- రూ. 65 వేలుటయోటా..ఫార్చ్యూనర్- రూ. 3.49 లక్షలులెజెండర్- రూ. 3.34 లక్షలుహిలుక్స్- రూ. 2.52 లక్షలువెల్‌ఫైర్- రూ. 2.78 లక్షలుక్యామ్రీ- రూ. 1.01 లక్షలుఇన్నోవా క్రిస్టా- రూ. 1.80 లక్షలుఇన్నోవా హైక్రాస్- రూ. 1.15 లక్షలుహ్యుందాయ్..గ్రాండ్ ఐ10 నియోస్ - రూ. 73,808అరా- రూ. 78,465ఎక్స్‌టర్- రూ. 89,209ఐ20- రూ. 98,053వెన్యూ- రూ. 1.23 లక్షలువెర్నా- రూ. 60,640క్రెటా- రూ. 72,145ఆల్కజార్- రూ. 75,376టస్కన్- రూ. 2.40 లక్షలురెనాల్ట్- కైగర్- రూ. 96,395 రేంజ్ రోవర్..4.4P SV LWB- రూ. 30.40 లక్షలు3.0D SV LWB- రూ. 27.40 లక్షలు3.0P ఆటోబయోగ్రఫీ- రూ. 18.30 లక్షలుస్పోర్ట్ 4.4 SV ఎడిషన్ 2- రూ. 19.70 లక్షలువేలార్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ- రూ. 6 లక్షలుఎవోక్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ- రూ. 4.60 లక్షలుడిఫెండర్ రేంజ్ - రూ. 18.60 లక్షలుడిస్కవరీ- రూ. 9.90 లక్షలుడిస్కవరీ స్పోర్ట్ - రూ. 4.60 లక్షలుస్కోడా..కోడియాక్- రూ. 5.80 లక్షలుకుషక్- రూ. 3.16 లక్షలుస్లేవియా- రూ. 1.83 లక్షలు