జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. మోదీ స్పీచ్‌లో ముఖ్యాంశాలివే

Wait 5 sec.

: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీఎస్టీ సంస్కరణల్లోని కీలక అంశాలపై మాట్లాడారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గి భారీగా డబ్బులు ఆదా అవుతాయన్నారు. ప్రస్తుత పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆత్మనిర్భరత వైపు అడుగులు పడతాయని, రాష్ట్రాలు, దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.'రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రాంభం కాబోతోంది. కొత్త చరిత్ర ప్రారంభమవుతోంది. జీఎస్టీ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సోమవారం నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్లు అమలులోకి రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయి. దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధి రేటుకు మరింత ఊతమిస్తాయి.'- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి