వాహనదారులకు అలర్ట్.. అటు వైపు వెళ్లకండి.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచన

Wait 5 sec.

హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత హీరోగా నటించిన కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం జరుగుతోంది. నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల కోసం అడ్వైజరీ జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరం మేరకు వాహనాలను దారి మళ్లించడం, లేదా నిలిపివేయడం జరుగుతుందని సూచించారు.అవసరం మేరకు ఈ క్రింది మార్గాలలో వాహనాల రాకపోకలను ఆపివేయటం లేదా దారి మళ్లించడం జరుగుతుందంటూ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపునకు వాహనాలను అనుమతించమని.. దానికి బదులుగా ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి వైపు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ వైపు అనుమతించమని.. వీటిని బీజేఆర్ విగ్రహం వద్ద నుంచి ఎస్బీఐ, అబిడ్స్ - నాంపల్లి స్టేషన్ రోడ్ మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. సుజాత స్కూల్ లేన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపునకు అనుమతించమని.. సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు దారి మళ్లించనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకూ.. రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్ బాగ్, బీజేఆర్ స్టాచ్యూ సర్కిల్, ఎస్‌బీఐ గన్ ఫౌండ్రీ, ఏఆర్ పెట్రోల్ పంప్( పబ్లిక్ గార్డెన్స్), కేఎల్‌కే బిల్డింగ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లకపోవటం మంచిదని సూచించారు. ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే తమను సోషల్ మీడియా ద్వారా సంప్రదించాలని.. ట్రాఫిక్ దారి మళ్లింపుల గురించి తెలుసుకుని సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.