: ఈక్విటీ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. లిస్టింగ్ గెయిన్స్ అందుకోవాలని చూస్తున్న వారికి ఈ వారం పండగే అని చెప్పాలి. దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం ఐపీఓల సునామీ తాకనుంది. ఏకంగా 28 కొత్త ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లు ఈ వారం సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆనంద్ రాతీ ఐపీఓ, జారో ఎడ్యుకేషన్ వంటి మెయిన్ బోర్డ్ ఐపీఓలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా 11 పబ్లిక్ ఇష్యూలు మెయిన్ బోర్డు నుంచి వస్తున్నాయి. 17 కంపెనీల పబ్లిక్ ఇష్యలు ఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తున్నాయి. మరి వాటి వివరాలు తెలుసుకుందాం. 11 మెయిన్ బోర్డ్ ఐపీఓలుమెయిన్ బోర్డ్ సెగ్మెంట్లో 11 కంపెనీల ఐపీఓలు ఈ వారం సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. అందులో అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ, గణేశ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ఐపీఓ, జారో ఇన్‌స్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసర్చ్ ఐపీఓ, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీఓ, ఆనంద్ రాతీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీఓ, సెషాసాయి టెక్నాలజీస్ ఐపీఓ, జైన్ రీసోర్సెస్ రీసైక్లింగ్ ఐపీఓ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీ ఐపీఓ, బీఎండబ్ల్యూ వెంచర్స్ ఐపీఓ, ట్రాల్ట్ బయో ఎనర్జీ ఐపీఓ, జింకుషాల్ ఇండస్ట్రీస్ ఐపీఓ ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.393 నుంచి రూ.414గా నిర్ణయించారు. ఇక జారో ఇన్‌స్టిట్యూట్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సైతం 23వ తేదీన మొదలై 25తో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ.846-890గా నిర్ణయంచారు. గణేశ్ కన్సూమర్స్ ప్రొడక్ట్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 22న ప్రారంభమై 24తో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ.306-322గా నిర్ణయించారు. ఎస్ఎంఈ ఐపీఓలుస్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ రంగంలో 17 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఇందులో ప్రైమ్ కేబుల్ ఇండస్ట్రీస్ ఐపీఓ, సాల్వెక్స్ ఎడిబుల్స్ ఐపీఓ, భారత్ రోహన్ ఎయిర్ బార్న్ ఇన్వోవేషన్స్ ఐపీఓ, ఆప్టస్ ఫార్మ ఐపీఓ, ట్రూ కలర్స్ ఐపీఓ, మాట్రిక్స్ జియో సొల్యూషన్స్ ఐపీఓ, ఎన్‌ఎస్‌బీ బీపీఓ సొల్యూషన్స్ ఐపీఓ, ఈకోలైన్ ఎక్జిమ్ ఐపీఓ, సిస్టమాటిక్ ఇండస్ట్రీస్ ఐపీఓ, జస్టో రీయల్ ఫిన్‌టెక్ ఐపీఓ, రిద్దీ డిస్ప్లే ఈక్విప్మెంట్స్ ఐపీఓ, గురునానక్ అగ్రికల్చర్ ఇండియా ఐపీఓ, ప్రారుహ్ టెక్నాలజీస్ ఐపీఓ, తెల్గా ప్రాజెక్ట్స్ ఐపీఓ, ఛట్టర్ బాక్స్ టెక్నాలజీస్ ఐపీఓ, భవిక్ ఎంటర్ ప్రైజెస్ ఐపీఓ, డీఎస్‌ఎం ఫ్రెస్ ఫుడ్స్ ఐపీఓ ఉన్నాయి. వీటిల్లో ప్రైమ్ కేబుల్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు కొనసాగుతుంది. షేరు ధరల శ్రేణి రూ.78-83గా నిర్ణయించారు. ఇక ఆప్టస్ ఫార్మా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 23వ తేదీ నుంచి 25 వరకు ఉంటుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.65-70గా నిర్ణయించారు. ఇక ట్రూ కలర్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 23వ తేదీ నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.181 నుంచి రూ.191గా నిర్ణయించారు.