ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక.. ఆ పరిమితి తొలగింపు.. జీవో జారీ..

Wait 5 sec.

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది.వినియోగానికి సంబంధించి పిల్లల వయో పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. దీంతో ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను.. తమ రిటైర్మెంట్‌లోపు ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు దివ్యాంగ పిల్లల సంరక్షణతో పాటుగా పిల్లల వయసుతో సంబంధం లేకుండా.. వివిధ అవసరాలకు ఈ సెలవు ఉపయోగించుకోవచ్చు. అయితే గతంలో పిల్లల వయసు 18 సంవత్సరాలు దాటితే ఈ సెలవులు ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని తొలగించడంతో పిల్లల అవసరాలు, అనారోగ్యం లేదా ఇతర సమయాల్లో.. సర్వీసు ముగిసే వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావటంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు (Maternity Leave) వినియోగించుకునేందుకు ఉండే నిబంధనను కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. గతంలో మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. అయితే ఈ నిబంధనను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మే నెలలో నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచారు. అయితే ఇద్దరు పిల్లల కన్నా తక్కువ మంది సంతానం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రసూతి సెలవులు ఉపయోగించుకోవాలనే రూల్ పెట్టారు. అయితే మారుతున్న పరిస్థితులను అనుసరించి.. జనాభాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. ఏపీ ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తివేసింది.రాష్ట్రంలో పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యుత్పత్తి రేటు తగ్గుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలను కనేందుకు దంపతులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు గతంలో వెల్లడించారు. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా5.38 కోట్లకు, 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని అంచనా. జనాభా పెరుగుదల అనుకున్నస్థాయిలో లేకపోతే రాష్ట్రంలో యువత తగ్గిపోతారని.. వృద్ధుల సంఖ్య పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే.. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ఉంది.