తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు ఇకపై పరుగులు పెట్టనున్నాయి. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన పాత బిల్లులు, కొత్త దశల వారీ చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను సమీకరించింది. దీనివల్ల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.కోసం ఆర్థిక వనరుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హడ్కో (HUDCO) నుండి రూ. 5 వేల కోట్ల భారీ రుణాన్ని తీసుకుంది. ఈ నిధుల రాకతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల బిల్లులను త్వరలోనే వారి వారి ఖాతాల్లో జమ చేసేందుకు హౌసింగ్ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. బేస్మెంట్, స్లాబ్ మరియు ఫినిషింగ్ వంటి వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కి నేరుగా డబ్బులు పంపిణీ చేయనుంది. నిధుల లభ్యత పెరగడంతో.. క్షేత్రస్థాయిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని కలెక్టర్లు , ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆదేశాలు అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు.. అంటే మార్చి 31 నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.48 లక్షల ఇళ్ల పనులు కొనసాగుతుండగా.. ఇప్పటికే 60 వేల ఇండ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయి. హౌసింగ్ సెక్రటరీ, కార్పొరేషన్ అధికారులు నిత్యం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించింది. హడ్కో లోన్ , భూముల వేలం ద్వారా వచ్చిన నిధులతో కలిపి ఈ మార్చి లోపు రికార్డు స్థాయిలో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం, పెండింగ్ బిల్లుల విడుదల వార్త ఇప్పుడు లబ్ధిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.