ధర రూ.4 మాత్రమే.. 9 నెలలకే 515 శాతం లాభం.. టాప్-10 పెన్నీ స్టాక్స్ ఇవే

Wait 5 sec.

Penny Stocks: స్టాక్ మార్కెట్లో కొన్ని ఊహించని విధంగా రాణిస్తుంటాయి. చాలా తక్కువ సమయంలోనే భారీ లాభాలు అందిస్తుంటాయి. అలా ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా లాభాలు అందించిన గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ గత 9 నెలల కాలంలో అత్యధికంగా 515 శాతం మేర లాభాలు అందించాయి. అంటే లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.6.15 లక్షల వరకు అందించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1000 కోట్లకు లోపల నుంచి మనం తెలుసుకుందాం. పెన్నీ స్టాక్స్ సాధారణంగా తక్కువ ధరకే లభిస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటాయి. అలాగే కొన్ని స్టాక్స్ భారీగా లాభపడుతుండడమూ ఇన్వెస్టర్ల దృష్టి పడేలా చేస్తాయి. అయితే ఈ స్టాక్స్ సాధారణంగా తక్కువ లిక్విడిటీ, అధిక అనిశ్చితి, పరిమిత ఆర్థిక పారదర్శకత వంటివి ఉంటాయి. అలాగే బలమైన రిస్క్ మేనేజ్మెంట్ కలిగి ఉండాలంటున్నారు. బ్లూ గాడ్ ఎంటర్‌టైన్మెంట్ (Bluegod Entertainment) షేరు ఈ ఆర్థిక ఏడాదిలో భారీ లాభాలు అందించింది. 9 నెలల్లో 515 శాతం లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.3.97 వద్ద ఉంది.సెల్విన్ ట్రేడర్స్ (Sellwin Traders) స్టాక్ ఈ ఆర్థిక ఏడాదిలో 210 శాతం మేర లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.9.48 వద్ద ఉంది.ఓన్‌టిక్ ఫిన్‌సర్వ్ (Ontic Finserve) కంపెనీ స్టాక్ ఈ ఏడాదిలో 180 శాతం రాణించింది. ఈ స్టాక్ ధర రూ.2.07 వద్ద ఉంది.ప్రో ఫిన్ క్యాపిటల్ సర్వీసెస్ కంపెనీ స్టాక్ 143 శాతం మేర లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.10.85 వద్ద ఉంది.పీపీవీ ఇన్‌ఫ్రా స్టాక్ ధర 9 నెలల్లో 133 శాతం మేర పెరిగింది. ఈ స్టాక్ ధర 4.90 వద్ద ఉంది.ఇండియా హోమ్స్ (India Homes) ఏ ఆర్థిక ఏడాదిలో 116 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.11.20 వద్ద ఉంది.అవాన్స్ టెక్నాలజీస్ (Avance Technologies) స్టాక్ ధర 88 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.1.11 వద్ద ఉంది.డీప్ డైమండ్ ఇండియా (Deep Diamond India)స్టాక్ ధర 74 శాతం మేర లాభపడింది. ఈ స్టాక్ ధర రూ.7.20 వద్ద ఉంది.ఎక్సెల్ రియాలిటీ ఎన్ ఇన్‌ఫ్రా (Excel Realty N Infra) స్టాక్ ఈ ఏడాదిలో 52 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.1.14 మాత్రమే.ఖూబ్‌సూరత్ స్టాక్ 24 శాతం లాభపడింది. ఈ స్టాక్ ధర 0.56 వద్ద ఉంది.ఎంపవర్ ఇండియా (Empower India) స్టాక్ 21 శాతం లాభపడింది. ఈ షేరు ధర రూ.1.82 వద్ద ఉంది.ఎస్‌వీఎస్ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ ఏ ఏడాదిలో 16 శాతం పెరిగింది. ఈ స్టాక్ రూ.14.11 వద్ద ఉంది.మిష్టాన్ ఫుడ్స్ స్టాక్ ధర 11 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.4.84 వద్ద ఉంది.