బిగ్‌బాస్ సీజన్-9 క్లైమాక్స్‌కి చేరుకుంది. నిన్నటి (డిసెంబర్ 14) ఎపిసోడ్‌లో. భరణి ఎలిమినేట్ కావడంతో కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్, డీమాన్ పవన్, సంజన.. టాప్‌-5గా ఫినాలే వీక్‌కి అడుగుపెట్టారు. వీరిలో కళ్యాణ్ వారం ముందే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న జరగబోతుంది.ఆదివారం రాత్రి జరగబోయే ఈ ఫినాలే ఎపిసోడ్‌ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అదే రోజు ఉదయం 11 గంటలకి స్టార్ మాలో వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో వచ్చింది. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఫైర్ స్ట్రామ్స్ Vs ఓజీస్.. అంటూ శ్రీముఖి సీజన్-9,8 కంటెస్టెంట్లని తీసుకొచ్చింది.సీజన్-8 తరఫున టేస్టీ తేజ, నిఖిల్, ప్రేరణ, శోభాశెట్టి, యష్మీ సందడి చేశారు. అలానే సీజన్-9 హౌస్‌మేట్స్ ప్రియ, దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి ఈ ఎపిసోడ్‌కి వచ్చారు. బిగ్‌బాస్ సీజన్-9 ఫినాలే నైట్ అక్కడ.. కానీ బిగ్‌బాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం మొత్తం ఇక్కడ.. అంటూ వీరిని శ్రీముఖి ఆహ్వానించింది.డీమాన్ అగ్నిపరీక్ష ట్రైనింగ్ నీ కోసమేముందుగా రీతూని చూడగానే శ్రీముఖి గట్టిగానే సెటైర్ వేసింది. నిజంగా అమ్మతోడు రీతూ అదిరిపోయేలా ఆడావ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. అంటూ హగ్గు ఇచ్చింది శ్రీముఖి. ఇంతలో రీతూ భయంకమైన స్మయిల్ బీజీఎమ్ వేసి ఎడిటర్ భయపెట్టాడు. అగ్నిపరీక్షలో డీమాన్ పవన్‌ని ట్రైన్ చేసింది నీకోసమే అనిపించింది నాకు.. అని శ్రీముఖి సెటైర్ వేయగానే ఆ ట్రైనింగ్ ఏది కనిపీయలేదే లోపల.. అంటూ రీతూ కౌంటర్ ఇచ్చింది.ఇంతలో టేస్టీ ది తేజ డ్రెస్ చూసి శ్రీముఖి పంచులేసింది. దీంతో ఈ షర్ట్ కేవలం రీతూ కోసం వేసుకొచ్చా.. చిన్నప్పుడు అది 1,2,3లు నేర్చుకోలేదు.. అంటూ తేజ గట్టిగా ఇచ్చాడు. సాయి శ్రీనివాస్.. ఇంకొన్ని గంటల్లో మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. కామనరా లేక సెలబ్రెటీనా.. అంటూ శ్రీముఖి అడిగింది. అన్న ఈ సీజన్‌కి వెళ్లుంటే చెప్పేవాడు.. అంటూ ఎక్స్‌ప్రెస్ హరి పంచు వేశాడు.ఇక దివ్వెల మాధురి కూడా ఈ ఎపిసోడ్‌కి రావడం విశేషం. ఆమెతో క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఇప్పించింది శ్రీముఖి. రాజా రాజా నా మన్మథ రాజా.. అని శ్రీముఖి, హరి, అవినాష్ పాడుతుంటే మాధురి తెగ సిగ్గుపడిపోయింది. డోంట్ ఫైర్ ది ఫైర్.. అంటూ డైలాగ్ కూడా కొట్టింది. మా కోసం ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా.. అని శ్రీముఖి అడగ్గానే హౌస్‌లో సంజన గురించి చెప్పిన డైలాగ్ మరోసారి రిపీట్ చేసింది మాధురి. నీకు బ్రెయిన్, సెన్స్ రెండూ లేవు.. హూ ఆర్ యూ.. అని మాధురి అడగ్గానే ఐయామ్ యూఆర్ ఫ్యాన్.. అంటూ అవినాష్ మోకాళ్ల మీద పడ్డాడు. దీంతో మాధురి తెగ నవ్వుకుంది.