డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పాట్ డెసిషన్.. నిమిషాల్లోనే ఆ ఊరికి రోడ్డు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ నిలిచారు. ఇటీవల సభ్యులు కలిసినప్పుడు.. టీమ్ కెప్టెన్ తమ ఊరికి రోడ్డు లేదని చెప్పగానే.. ఇప్పుడు అదే తరహాలో స్పందించారు. నిమిషాల్లోనే రోడ్డు మంజూరు చేసి దటీజ్ అనిపించుకున్నారు. మంగళవారం రోజున.. మంగళగిరి వేదికగా కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభావేదికగా ఓ కానిస్టేబుల్ తమ ఊరికి రోడ్డు వేయాలని కోరగానే.. నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవరపల్లి పంచాయతీ తెనుములబండకు చెందిన లాకే బాబూరావు అనే యువకుడు కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. నియామకపత్రాల ప్రదానోత్సవంలో లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరిస్తూ.. తమ గ్రామానికి రోడ్డు వేయించమని సీఎం చంద్రబాబును కోరారు. దీంతో సీఎం చంద్రబాబు.. ఈ బాధ్యతను వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. దీంతో అక్కడికక్కడే స్పందించిన పవన్ కళ్యాణ్.. బాబూరావు చెప్పిన వివరాల మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి.. రూ. 2 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించి పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. అనంతరం అల్లూరి జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. దీంతో వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తి చేస్తే.. సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు పవన్ కళ్యాణ్. మరోవైపు మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డిసెంబర్ 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ మొదలుకానుంది. రెండు దశల్లో 9 నెలల పాటు శిక్షణ అందించనున్నారు. నియామక పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు.