ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. రహదారుల వెంబడి చెప్పులు కుడుతూ జీవించే చర్మకారులతో వీటిని ఏర్పాటు చేయిస్తామని లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. దాతల సహకారంతో చర్మకారులకు సీబీఎన్ రక్ష ఫుట్‌వేర్ ప్రొఫెషనల్ దుకాణాలు అందించి.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడతామన్నారు. సోమవారం రోజున తాడేపల్లిలో 14 మంది లబ్ధిదారులకు ఈ దుకాణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు.. దాతల సహకారంతో అన్ని నియోజకవర్గాలలో వీటిని ఏర్పాటు చేయిస్తామన్నారు. ఒక్కో దుకాణం విలువ 80 వేల రూపాయలుగా వెల్లడించారు.*మరోవైపు ఓ దాత ఇచ్చిన సాయంతో ఈ 14 దుకాణాలను తెనాలి, చీరాల, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు చెందిన చెప్పులు కుడుతూ జీవించే చర్మకారులకు వీటిని అందించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించే చర్మ సంబంధిత వస్తువులను లిడ్ క్యాప్ నుంచే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారని లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. ఈ ఆదేశాల ప్రకారం పోలీసులు, పాఠశాలలు, అటవీ శాఖ వినియోగించే చర్మ సంబంధిత సామాగ్రిని లిడ్ క్యాప్ నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. *మరోవైపు లిడ్ క్యాప్ () అంటే Leather Industries Development Corporation of Andhra Pradesh. చర్మకారులు, లెదర్ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం లిడ్ క్యాప్ ఏర్పాటు చేసింది. లిడ్ క్యాప్ ద్వారా తోలు ఉత్పత్తుల తయారీతో పాటుగా చర్మకారులకు శిక్షణ, ఉపాధి, ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్ సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. * చర్మకారులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటంతో పాటుగా పర్యాటక ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయడం.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చెప్పులు కుట్టే చర్మకారులు చెప్పుల దుకాణాలు ఏర్పాటు చేయించి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తోంది లిడ్ క్యాప్. దాతల సహకారంతో ఈ సీబీఎన్ రక్ష ఫుట్‌వేర్ దుకాణాలను ఏర్పాటు చేయిస్తోంది.