బీచ్‌లో ఉగ్రదాడి.. ముష్కరుల కాల్పుల్లో 10 మందికిపైగా పర్యాటకులు మృతి

Wait 5 sec.

ఆస్ట్రేలియాలో దుండుగులు రెచ్చిపోయారు. ప్రముఖ బీచ్‌లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది పర్యాటకులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మొత్తం 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమవ్వగా.. మరొకర్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో పర్యాటకుల హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ప్రశాంతంగా ఉన్న బీచ్‌లో ఒక్కసారిగా బీతావాహ పరిస్థితి నెలకుంది. ఈ కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆయన అన్నారు. ఘటనా స్థలిలో బాధితులను రక్షించేందుకు పోలీసులు, అత్యవసర సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు.‘‘ఏఎఫ్‌పీ కమిషనర్, న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్‌‌లతో మాట్లాడాను.. మేము స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తున్నాం.. మరిన్ని వివరాలను ధ్రువీకరించిన అనంతరం తదుపరి సమాచారం అందిస్తాం... పోలీసుల సూచనలను ప్రజలు పాటించాలి’ అని ఆంథోనీ ఆల్బనీస్ ఓ ప్రకటనలో తెలిపారు.