న్యూ ఇయర్ వేడుకలపై అలర్ట్.. ఇవి పాటించకపోతే జైలుకే, ఈసారి స్ట్రిక్ట్ రూల్స్!

Wait 5 sec.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో న్యూఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోనూ కోలాహలంగా జరుపుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. అర్థరాత్రి 12 గంటలు కాగానే ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే నగంరలో ఈ న్యూ ఇయర్ ఆనందోత్సవాన్ని సురక్షిత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వేడుకలను నిర్వహించే అన్ని హోటల్స్ యాజమాన్యాలు, ఈవెంట్ నిర్వహకులకు.. పోలీసులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇవి పాటించని వారికి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అర్ధాత్రి వరకు అనుమతి.. 3 అంతకంటే ఎక్కువ స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెట్లు, పబ్‌లకు కొత్త సంవత్సరం వేడుకల మార్గదర్శకాలను సీపీ సజ్జనార్ జారీ చేశారు. కొత్త సంతవ్సరం రాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ స్వాగత వేడుకులను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు యజమానులు, నిర్వాహుకులు.. ఆదేశించారు. ట్రాఫిక్, సీసీటీవీ కెమెరాలు.. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్‌మెంట్ చట్టం, 2013 ప్రకారం.. నిర్వాకులు వేడుకలు జరిగే ప్రాంతంలో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే న్యూ ఇయర్ వేడుకల నిర్వాహకులు.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రైవేటు సెక్యురిటీ గార్డ్స్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించుకోవాలి. అశ్లీలత అస్సలు ఉండొద్దు...వేడుకల వద్ద సెక్యురిటీని పటిష్టంగా పెట్టుకోవాలి. డీసెంట్ అప్పారెల్, డ్యాన్స్, మాటలు ఉండాలి. అశ్లీలత అస్సలు ఉండొద్దు.సౌండ్స్ సిస్టమ్స్.. సౌండ్ సిస్టమ్, లౌడ్ స్పీకర్, డీజే సౌండ్ మిక్సర్ వంటివి అన్నీ రాత్రి 10 తర్వాత ఆపేయాలి. రాత్రి 10 గంటల తర్వాత 45 డెసిబెల్స్ మించకుండా సౌండ్‌ను సిస్టమ్స్ వాడేందుకు అవకాశం ఉంది. అయితే బహిరంగంగా ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ పెట్టకూడదు. కేవలం హోటల్స్, కమ్యూనిటీ హాల్స్, బాంక్వెట్ హాల్స్ ఇండోర్ లోనే ఈ సౌండ్ కు అనుమతి ఉంటుంది. అది కూడా రాత్రి 1 గంటల వరకు మాత్రమే.ఎక్కువ మందికి నో పర్మిషన్.. వేడుక జరిగే ప్రాంతంలో ఆయుధాలకు అనుమతి ఇవ్వొద్దు. అంతేకాకుండా సామర్థ్యానికి మించి పాసులు, టికెట్లను విక్రయించవద్దు. పబ్స్, బార్స్, కపుల్స్ కార్యక్రమాల్లో మైనర్‌లను పర్మిషన్ ఇవ్వొద్దు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. మత్తు పదార్థాలు వాడితే.. పోలీసులు చిత్తు చేస్తారు.. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడొద్దు. అలాంటివి ఎవరైనా వాడుతున్నారని తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి కాబట్టి.. నిర్వాహకులు మద్యం సేవించి వాహనాలను నడుపకుండా డ్రైవర్‌లను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఎక్సైజ్ విభాగం సూచించిన టైమ్, నిబంధనల మేరకు గెస్ట్‌లకు మద్యం ఇవ్వాలి. వేడుకల వద్ద మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరము. ఉంటుందనే ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేయాలి.