ఎస్‌బీఐ X హెడ్‌డీఎఫ్‌సీ X ఐసీఐసీఐ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఏ బ్యాంక్ బెటర్, వడ్డీ రేట్లు ఎందులో ఎక్కువ?

Wait 5 sec.

SBI FD Rate Cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలో రెపో రేటును నాలుగు సార్లు తగ్గించింది. మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినడిసెంబర్ 15, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణ వివరాల ప్రకారం 2 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జనరల్ కస్టమర్లకు 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించింది. అలాగే సీనియర్ సిటిజన్లకు అయితే 6.95 శాతం నుంచి 6.90 శాతానికి కుదించింది. వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ప్రస్తుతం ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 3.05 శాతం నుంచి 6.45 శాతం (అమృత్ వృష్టి స్కీమ్) మధ్య ఉన్నాయి. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3.55 శాతం నుంచి 7.05 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో 5-10 ఏళ్ల మెచ్యూరిటీ స్కీమ్, ఎస్‌బీఐ వీకేర్ స్కీమ్ వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే గరిష్ఠ వడ్డీ రేటు 7.05 శాతం మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎఫ్‌డీ వడ్డీ రేట్లుప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన ఇక సీనియర్ సిటిజన్లు అయితే 3.25 శాతం నుంచి 7.10 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ రేట్లు జూన్ 25, 2025 నుంచే అమలులో ఉన్నాయి. అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుంచి 21 నెలలలోపు డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్ల 1 రోజు నుంచి 2 ఏళ్ల 11 నెలలు, 2 ఏళ్ల 11 నెలల నుంచి 35 నెలల వరకు డిపాజిట్లపై సీనియర్లకు గరిష్ఠంగా 6.95 శాతం వడ్డీ ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఎఫ్‌డీ వడ్డీ రేట్లుమరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు సైతం డిసెంబర్ 15, 2025 నుంచే కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 6.60 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు అయితే ఈ వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 7.20 శాతంగా ఉంది. గరిష్ఠ వడ్డీ రేటు 5 ఏళ్ల ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీ స్కీమ్, 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై ఆఫర్ చేస్తోంది. కెనరా బ్యాంకులో ఎఫ్‌డీ వడ్డీ రేట్లుఈ ప్రభుత్వ బ్యాంకులో కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 8, 2025 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.15 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అయితే 3.50 శాతం నుంచి 6.65 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. 555 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లు అందిస్తోంది.