అందుబాటులోకి రానుంది. నెల్లూరులో మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూల్‌ను పాఠశాలను స్థాపించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. రూ.15 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు సమకూర్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. *నెల్లూరులోని జామియా మసీదుకు చెందిన 13 ఎకరాల వక్ఫ్ భూమిలో ఈ పాఠశాల నిర్మించనున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. 13 ఎకరాలలో ఐదు ఎకరాలు ఇంటర్నేషనల్ స్కూలు కోసం, మూడు ఎకరాలు మసీదు సంబంధిత సౌకర్యాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. మిగిలిన భూమిని వక్ఫ్ బోర్డు కార్యకలాపాల కోసం స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి ఉపయోగించనున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.*ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. మంత్రి నారాయణ కూడా దాతలను సమీకరించడం ద్వారా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని అజీజ్ తెలిపారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పూర్తిగా వక్ఫ్ బోర్డు యాజమాన్యం నిర్వహణలో ఉంటుందన్నారు. మరోవైపు వక్ఫ్ బోర్డు ఆస్తుల ప్రైవేటీకరణ పుకార్లను తోసిపుచ్చిన అజీజ్.. వక్ఫ్ ఆస్తులను రాజకీయం చేయకూడదని అన్నారు.*మరోవైపు మంత్రి నారాయణ కేవలం సీఎస్ఆర్ కింద దాతలను సమీకరించడంలో తోడ్పాటు అందిస్తారని.. స్కూలు మొత్తం నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డు చూసుకుంటుందని అజీజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు.. విద్య ద్వారా సమ్మిళిత అభివృద్ధి. సాధికారత అనే ప్రభుత్వ దార్శనికతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సాంస్కృతిక విలువలను కాపాడుతూ, ప్రపంచ స్థాయి విద్యను అందిస్తుందని ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పుకొచ్చారు.