ఎట్టకేలకు ‘వార్ 2’ నష్టాలపై నోరువిప్పిన నిర్మాత నాగవంశీ

Wait 5 sec.

, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన హిందీ సినిమా 'వార్ 2'. ఇది తారక్ కు బాలీవుడ్ డెబ్యూ. 'వార్' సీక్వెల్ గా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. అయితే ఈ సినిమా ఫలితంపై తాజాగా నిర్మాత నాగ వంశీ స్పందించారు. 'వార్ 2' చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోవడంతో, నెటిజన్లు సోషల్ మీడియాలో నాగవంశీని విపరీతంగా ట్రోల్ చేశారు. నిర్మాత ఆస్తులు అమ్ముకొని దుబాయ్ కి వెళ్లిపోయారంటూ పుకార్లు ప్రచారం చేశారు. అన్ని కోట్ల నష్టం వచ్చిందని, ఇన్ని కోట్లు పోయాయంటూ ఎవరికి ఇష్టమొచ్చిన లెక్కలు వాళ్లు చెప్పారు. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. 'వార్ 2' నష్టాలపై క్లారిటీ ఇచ్చారు. 'వార్ 2' సినిమా విషయంలో తాను నష్టపోయిన మాట వాస్తవమేనని అంగీకరించిన నాగవంశీ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు భారీగా నష్టపోలేదని తెలిపారు. నిర్మాతల సపోర్టుతో స్వల్ప నష్టాలతో బయటపదినట్లు చెప్పారు. ''ట్విట్టర్ ఉత్సాహపరులు ఇంత పోయింది.. అంత పోయింది అని ప్రచారం చేస్తున్నారు. 'వార్ 2' సినిమాని మేము కొన్నదే 68 కోట్ల రూపాయలకి. రిలీజుకు ముందే వాళ్లు మాకు జీఎస్టీ ఇచ్చేశారు. సినిమా థియేటర్లలో 35 - 40 కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు పిలిచి మరీ రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చారు. బాంబేకి చెందిన కార్పొరేట్ కంపెనీ అయినా, నేను అడిగ్గానే పిలిచి డబ్బులిచ్చారు. ఇంక మాకు అక్కడ పోయింది ఏముంది'' అని నాగవంశీ అన్నారు.