ట్రాన్స్‌ఫర్ ఆపాలంటూ మంత్రులతో DC ఫోన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన GHMC కమిషనర్

Wait 5 sec.

హైదరాబాద్ ఆదేశాలను ధిక్కరించిన ఒక ఉపకమిషనర్‌పై (DC) సస్పెన్షన్ వేటు పడటం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కమిషనర్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. రాజకీయ ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నించిన అల్వాల్ సర్కిల్ ఉపకమిషనర్ వి.శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన సదరు అధికారిపై విచారణ పెండింగ్‌లో ఉందని, అనుమతి లేకుండా నగరాన్ని విడిచి వెళ్లకూడదని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ వివాదానికి తెలుస్తోంది. అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడ సర్కిల్‌కు శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. కవాడిగూడకు వెళ్లడం ఇష్టం లేని శ్రీనివాసరెడ్డి.. కమిషనర్ నిర్ణయాన్ని మార్పించేందుకు రాజకీయ నాయకుల ద్వారా విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఏకంగా మంత్రులు, ఎంపీలతో కమిషనర్‌కు ఫోన్ చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిషనర్ కర్ణన్ ప్రజాప్రతినిధులకు గట్టిగా బదులిస్తూ.. ముందుగా ఆ అధికారి బాధ్యతలు స్వీకరించాలని ఆ తర్వాతే ఇతర విషయాలు మాట్లాడదామని తెగేసి చెప్పారు. అయినప్పటికీ.. శ్రీనివాసరెడ్డి మొండిగా వ్యవహరిస్తూ విధుల్లో చేరకపోవడంతో కమిషనర్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. డీసీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఉపకమిషనర్ శ్రీనివాసరెడ్డి బదిలీ వార్త తెలియగానే అల్వాల్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. అల్వాల్ ఐకాస ఆధ్వర్యంలో స్థానికులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఒక ప్రభుత్వ అధికారి బదిలీని ప్రజలు పండుగలా జరుపుకోవడం ఆయన పాలనా తీరుపై ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. అల్వాల్‌లో ఆయన పనితీరుపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.నగరంలోని ఇతర సర్కిళ్లలోనూ అవినీతి ఆరోపణలు, రాసలీలల వివాదాలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపకమిషనర్లపై కమిషనర్ దృష్టి సారించారు. ఇప్పటికే అటువంటి అధికారుల చిట్టా సిద్ధమైందని, త్వరలోనే మరికొందరికి స్థానచలనం, కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కర్ణన్ హెచ్చరించారు. పాలనలో పారదర్శకత, క్రమశిక్షణను పెంచేందుకు ఈ చర్యలు అవసరమని యంత్రాంగం భావిస్తోంది. ఈ పరిణామం జీహెచ్‌ఎంసీలోని ఇతర అధికారులకు ఒక గట్టి హెచ్చరికగా మారింది.