వైఎస్ జగన్‌పై అభిమానం.. గోదారి లంకలో 40 వేల అడుగుల ఫ్లెక్సీ

Wait 5 sec.

అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్వేడుకలకు సర్వం సిద్ధమైంది. వైఎస్ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ఫ్లెక్సీలు, హోర్డింగులతో వైఎస్ వైసీపీ కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కేక్ కటింగులతో అధినేతకు ఇప్పటికే అడ్వాన్సుగా శుభాకాంక్షలు తెలియజేయటం కూడా మొదలైపోయింది. విదేశాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే రాజమండ్రి గోదారి లంకలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. రాజమండ్రిలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అక్కడి వైసీపీ నేతలు. వైసీపీ నేత వినయ్ తేజ ఆధ్వర్యంలో గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల చిత్రాలతో ఈ ఫ్లెక్సీని రూపొందించారు. గోదావరి మధ్యలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు వైఎస్ జగన్ మీద తమ అభిమానాన్ని ఇలా ఫ్లెక్సీ రూపంలో తెలియజేసినట్లు రాజమండ్రి వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు తాడేపల్లిలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో కూడిన వైఎస్ జగన్ కటౌట్ కూడా వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ వ్యక్తి వైఎస్ జగన్ మీద అభిమానంతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించినట్లు తెలిసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన రవీందర్ యాదవ్ అనే వ్యక్తి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్ ఫోటోలతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ఈ ఫ్లెక్సీ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేదీ తెలిసిన సంగతే. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో వైఎస్ జగన్.. కేసీఆర్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.