రీతూ కోసం నిలబడ్డది ఎవరంటే డెమాన్ పవన్ అని చెప్పొచ్చు.. డెమాన్ కోసం నిలబడింది ఎవరంటే రీతూ అని చెప్పొచ్చు. సంజన కోసం నిలబడింది ఎవరంటే ఇమ్మానుయేల్ అని చెప్పొచ్చు. అలాగే తనూజ కోసం నిలబడింది ఎవరంటే భరణితో పాటు చాలామందిని చెప్పొచ్చు. భరణి కోసం సుమన్ శెట్టి... దివ్య కోసం భరణి.. ఇలా చాలామందిని చెప్పొచ్చు. కానీ.. కళ్యాణ్ కోసం తనూజా.. తనూజ కోసం కళ్యాణ్ గట్టిగా నిలబడి ఆడిన ఆట ఏదైనా ఉందా అంటే.. టక్కునమాత్రం ఇదిగో ఇది ఉంది కదా అని చెప్పలేం. ఒకరకంగా చెప్పాలంటే.. సీజన్ మొత్తం చూస్తే కళ్యాణ్ ఆ చివరి వారంలో తనూజ వెంట పడ్డాడు. ఆమెను గెలిపించడానికి ఆడాడు. ఇంకా పిచ్చిగా చెప్పాలంటే.. ఆమెపై ఇతనికి మోజు ఉంది కాబట్టి.. ఆమె వెనకే పడుతున్నాడు. ఆమెను తెగ ట్రై చేస్తున్నాడు కాబట్టి.. తన గెలుపు కంటే తనూజ గెలుపు కోసమే ఎక్కువ ఆరాటపడుతున్నాడు. ఇక తనూజ అంటారా.. చెప్పమన్నప్పుడో.. లేదంటే తప్పదు అన్నప్పుడో కళ్యాణ్ వైపు నిలబడటం తప్పితే.. తనంతట తాను తాను ఓడిపోయినా పర్లేదు కానీ.. కళ్యాణ్ గెలవాలి అన్నది మాత్రం లేదు. ఈ విషయంలో రీతూ కోసం డెమాన్ చాలాసార్లు ఓడిపోయాడు. ఆమెను గెలిపించాడు. రీతూ కూడా చాలా విషయాల్లో అతని వైపు గట్టిగా నిలబడింది. కానీ తనూజ-కళ్యాణ్‌ల గురించి చెప్పుకోవాలంటే వీళ్ల మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అన్నది తప్పితే.. ఒకరికోసం ఒకరు నిలబడ్డారు అనడానికి లేదు. కానీ చివరి వారం.. చివరి రోజుకి వచ్చేసరికి మాత్రం.. వాళ్లు ఒకరికోసం ఒకరు చెప్పారయ్యా డైలాగ్‌లూ. బయట ఉన్న వాళ్ల ఫ్యాన్స్ చూస్తే మాత్రం తలలు బాదుకుంటారు. మిమ్మల్ని గెలిపించడానికి మేం బయట నానా సంకలూ నాకుతుంటే.. మీరు మాత్రం తెగ రాసుకుని పూసేసుకుంటున్నార్రేంట్రా బాబూ.. మీరూ మీరూ బాగానే ఉన్నారు.. బయట మమే వెధవలం అన్నమాట అని అనుకోక తప్పరు ఈ ప్రోమో చూస్తే. కళ్యాణ్ పడాలలో నన్ను నేను చూసుకుంటున్నా.. ప్రతి ఒక్క ఇంట్లో.. ప్రతి ఒక్క లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఉండాలి అని తనూజ అన్నదంటే ఔరా అంత ఉందా? వీళ్ల మధ్య అనేట్టుగా ఉంది ఈ భారీ డైలాగ్. ఇక కళ్యాణ్ పడాల అంటారా.. ముందు నుంచి తనూజకి లైన్ వేస్తూనే ఉన్నాడు. మనోడికి వర్కౌట్ కాలేదు కానీ.. ఇంకా తన ప్రయత్నం అయితే ఆపకుండా యుద్ధం చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అవకాశం రావడంతో.. ‘కళ్యాణ్ అనేవారు మారాడూ.. ఒక పర్ఫెక్ట్ గేమ్‌ని అర్థం చేసుకుని గేమ్‌లోకి దిగాడు అంటే.. అది తనూజ వల్లే’ అని తనూజని ఆకాశానికి ఎత్తేశాడు కళ్యాణ్. ఆ మాటకి తనూజ కూడా.. కళ్యాణ్‌ని చెప్తున్నది నా గురించే అంటావా? అన్నంతగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఎందుకంటే.. కళ్యాణ్‌ని పర్ఫెక్ట్ గేమర్‌గా తనూజ మార్చింది అయితే ఈ 104రోజుల ఎపిసోడ్‌లో ఎప్పుడూ చూపించలేదు. మరి ఏమైనా బిగ్ బాస్ హౌస్‌లో లైట్‌లు ఆర్పేసిన తరువాత కానీ గేమర్‌గా మార్చిందేమో కానీ.. ఎపిసోడ్‌లలో అయితే చూపించలేదు. వీళ్లు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటుంటే.. వీళ్ల మధ్య ఇంత జరిగిందా అన్నట్టుగా చూస్తూ ఉండిపోయారు హౌస్‌లో ఉన్న వాళ్లు. వాళ్లే కాదు చూసేవాళ్లకీ అదే అనిపించింది. వీళ్ల డైలాగ్‌లు కొట్టినప్పుడు డెమాన్, ఇమ్మానుయేల్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అర్థమైపోతుంది. లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఉండాలి అని తనూజ అన్నప్పుడు కళ్యాణ్ ఫేస్ చూడాలబ్బా వెలిగిపోయింది. ఆ తరువాత టాప్ 5 కంటెస్టెంట్స్‌తో కేక్ కట్ చేయించారు శ్రీముఖి, ప్రదీప్‌లు.