ఆంధ్రప్రదేశ్‌లోని. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం తీసుకువచ్చింది. సీఎం నారా నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. సీఎం జిల్లా తాళ్లపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా తాళ్లపాలెం గురుకుల పాఠశాలను సందర్శించిన చంద్రబాబు.. విద్యార్థుల కోసం ‘ముస్తాబు’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం.. అక్కడి విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. వివిధ అంశాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.ముస్తాబు కార్యక్రమం అంటే..మరోవైపు విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నారు. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం పెంచే పనులు చేపట్టనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ విధానం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా.. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ముస్తాబు కార్నర్.. ఇక ముస్తాబు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఎవరైనా ఇంటిదగ్గర సరిగా తయారై స్కూలుకు రాకపోతే.. అలాంటి విద్యార్థులను గుర్తించి, ముస్తాబు కార్నర్‌ వద్ద వారిని ముస్తాబు చేస్తారు. వారిని ముఖం కడుక్కుని, తల దువ్వుకుని చక్కగా తయారై వచ్చాకే క్లాస్ రూమ్‌లోకి అనుమతిస్తారు. ఇందుకోసం ముస్తాబు కార్నర్ వద్ద అద్దం, సబ్బు, నెయిల్ కట్టర్, దువ్వెన, హ్యాండ్ వాష్, టవల్ వంటి ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రోజూ శుభ్రమైన యూనిఫాం, చెప్పులు ధరించి స్కూలుకు రావటంతో పాటుగా.. గోళ్లు, హెయిర్ కటింగ్ వంటివి చక్కగా ఉండేలా స్కూలు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అలాగే.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన సమయంలో, భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రపరుచుకునేలా చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతపై చార్టులు, పోస్టులు ఏర్పాటు చేస్తారు. మరోవైపు విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రతి వారం ముస్తాబు స్టార్ పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తారు. వారపు ముస్తాబు స్టార్‌ పేర్లను ప్రకటిస్తారు. అలాగే నెలవారీ పరిశుభ్రమైన తరగతి గది, వసతి గృహం అవార్డులు అందిస్తారు. అలాగే జిల్లాస్థాయిలో ఉత్తమ పాఠశాల, వసతి గృహం అవార్డులు కూడా అందిస్తారు.