అణు జలాంతర్గామి నుంచి 3,500 కి.మీ. పరిధి గల కే-4 క్షిపణిని పరీక్షించిన భారత్

Wait 5 sec.

భారత్ తన అణ్వాయుధ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ.. నుంచి కే-4 అనే మధ్యంతర-శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. డిసెంబరు 22న మంగళవారం బంగాళాఖాతంలో విశాఖపట్నం తీరానికి దూరంగా ఈ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో భూమి, గాలి, నీటి అడుగు నుంచి కూడా అణ్వాయుధాలను ప్రయోగించగల దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది సముద్ర జలాల్లో భారత నౌకాదళం అణ్వాయుధ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. గతేడాది ఆగస్టు 29.. భారత్‌కు అత్యంత సుదూర లక్ష్యాలను చేధించగలిగే సముద్ర ఆధారిత వ్యూహాత్మక ఆయుధంగా నిలుస్తుంది. ఉపరితలం నుంచి ప్రయోగించే అగ్ని-III వెర్షన్‌ను సముద్రం జలాల నుంచి ప్రయోగానికి వీలుగా అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి జలాంతర్గామి నుంచి బయటకు వచ్చి, నీటి ఉపరితలంపైకి తేలి, ఆపై రాకెట్ మోటారును మండించి గాలిలోకి దూసుకుపోయేలా మార్పు చేశారు. ఈ క్షిపణి 2.5 టన్నుల అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలదు. అరిహింత్ శ్రేణి జలాంతర్గాముల నుంచి దీనిని ప్రయోగించవచ్చు.కే-4 క్షిపణి, భారత అణ్వాయుధ త్రయం (nuclear triad)లో అత్యంత రహస్యమైనది. అరిహంత్-శ్రేణి జలాంతర్గాములు సుదీర్ఘకాలం పాటు సముద్ర అడుగున నిశ్శబ్దంగా ‘నిరోధక పెట్రోలింగ్’ (deterrence patrols) కోసం నిర్మించారు. ‘కే’ అనే అక్షరం, భారత్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) లో కీలక పాత్ర పోషించిన ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళిగా పెట్టారు.పూర్తి అణు సామర్థ్యంతో దేశీయ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌’. ఇది 2018 నుంచి నేవీకి సేవలు అందిస్తోంది. దీని స్ఫూర్తి, డిజైన్, అనుభవంతో ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ను నిర్మించారు. భారత నౌకాదళంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర. దీనిని రష్యా నుంచి భారత్ లీజుకు తీసుకుంది. కానీ, 2011 డిసెంబరులో భారత్ సొంతంగా అణు జలాంతర్గాముల నిర్మాణాన్ని చేపట్టింది.