ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 వరల్డ్ కప్ 2026 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అందులో యంగ్ ప్లేయర్ శుభ్‌ గిల్‌‌ను తప్పించి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్.. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ ‌అలీ ట్రోఫీలో మెరుపు సెంచరీ చేశాడు. ఇతడి సారథ్యంలోని జార్ఖండ్ జట్టు ఫైనల్‌లో హర్యానాను ఓడించి.. . అయితే జార్ఖంజ్ SMAT ట్రోఫీ గెలవడం వెనుక దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ క్రికెట్ పునర్వవస్థీకరణలో ప్రతి అడుగులో ధోనీ పాత్ర ఉన్నట్లు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేష్ (JSCA) జాయింట్ సెక్రటరీ నదీమ్ షా వెల్లడించారు. ఎంఎస్ ధోనీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినప్పటికీ.. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. క్రికెట్‌తో, ముఖ్యంగా జార్ఖండ్‌ క్రికెట్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే జార్ఖండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడానికి.. 2024లో జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA)లో జరిగిన పునర్వ్యవస్థీకరణ కారణమని తెలుస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్‌లో క్రికెట్ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ ప్రణాళికల కోసం ధోనీ సలహా కోరినట్లు నదీమ్ షా వెల్లడించారు. ఈ క్రమంలో ధోనీ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణలో పాలుపంచుకున్నాడని తెలిపారు. కోచింగ్ స్టాఫ్ నియామకాలతో.. జట్టులో ఉన్న ఆటగాళ్లను విశ్లేషించడంలో కూడా ధోనీ పాలుపంచుకున్నాడని చెప్పారు. తాము ప్రతి విషయంలో ధోనీ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ జరుగుతున్నంతసేపు ధోనీ టోర్నీని ఫాలో అయ్యాడని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలన్నింటినీ గమనించి తమతో చర్చించాడని తెలిపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ 11 మ్యాచ్‌లలో 10 గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో. అతడు 10 ఇన్నింగ్స్‌లలో 197 స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు చేశాడు. అంతేకాకుండా యువ ఆటగాడు కుమార్ కుషాగ్ర కూడా లోయర్ ఆర్డర్‌లో విధ్వంసకర ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఇక ఆల్ రౌండ్ ప్రదర్శనతో అనూకుల్ రాయ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. 303 పరుగులు, 19 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, టోర్నమెంట్ కు జరిగిన సన్నాహాలు, ఆటగాళ్ల ఎంపికలో ధోనీ ముద్ర స్పష్టంగా కనిపించింది.