అమెరికా దెబ్బకు ఆకాశానికి 'బంగారం' ధర.. ఒక్కరోజే రూ.20 వేలు పెరిగిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే

Wait 5 sec.

Gold Rates: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరల షాక్ తగులుతోంది. రోజు రోజుకూ ఊహించని విధంగా పెరుగుతూ ఆకాశాన్ని తాకుతోంది. సరికొత్త గరిష్ఠాలను తాకుతూ పైపైకి దూసుకెళ్తోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దెబ్బకు విపరీతంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించడంతో బంగారం రేటు ఆల్ టైమ్ హై స్థాయిని తాకింది. డిసెంబర్ 28వ తేదీన సైతం బంగారం, వెండి రేట్లు మరింత పెరిగి మరో కొత్త గరిష్ఠాన్ని నమోదు చేశాయి. వచ్చే కొత్త ఏడాదిలోనూ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గుతుంది. దీంతో బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఈ క్రమంలో డిసెంబర్ 28వ తేదీ బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 54 డాలర్లకు పైగా పెరిగి 4534 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 10 శాతానికిపైగా పెరిగింది. దీంతో ఔన్స్ సిల్వర్ రేటు 79 డాలర్లు దాటింది. హైదరాబాద్‌లో బంగారం ధరలువాళ 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి రూ.1200 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.1,41,220 వద్దకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1100 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,29,450 వద్దకు చేరుకుంది. రూ.20 వేలు పెరిగిన వెండిబంగారం ధరల కన్నా వెండి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా వెండి పరుగులు పెడుతోంది. క్రితం రోజు కిలో వెండి రేటు రూ.9000 మేర పెరగగా ఈరోజు ఏకంగా రూ.20 వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,74,000 స్థాయికి చేరుకుంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు డిసెంబర్ 28వ తేదీ ఆదివారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్ ధరలు మధ్యాహ్నానికి అప్డేట్ అవుతుంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి పన్నులు మారతాయి కాబట్టి ధరల్లోనూ వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.