భోగాపురం వరకు మరో రహదారి.. ఆ రాష్ట్రం నుంచే.. ఆ ప్రాంతానికి మహర్దశ

Wait 5 sec.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెంచడం కోసం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా సులభంగా, త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో నిర్మించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. దీని గురించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భువనేశ్వర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఒక కొత్త రహదారిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీని తీసుకురావడమే కాక, పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన అడుగుగా నిలుస్తుంది అన్నారు.అలానే విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక క్లస్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు ఉత్తమ భవిష్యత్తు లభించబోతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాలలో ఈ జిల్లాలో అపారమైన మార్పులు సంభవిస్తాయని, ఫలితంగా నూతన శ్రీకాకుళం ఆవిష్కరణను ప్రజలు చూడబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పలు ముఖ్యమైన ప్రాజెక్టులు శ్రీకాకుళం ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు తోడ్పడతాయి అన్నారు. ఈ రహదారి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు.భోగాపురంలో నిర్మిస్తోన్న అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్ని వేగవంతం చేశారు. వచ్చే ఏడాదిలో తప్పకుండా దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం కోసం 2,708.26 ఎకరాలు కేటాయించారు. భారీగా నిధులు మంజూరు చేశారు. అలానే భోగాపురం విమానాశ్రయం కోసం, విశాఖపట్నం బీచ్‌ రోడ్‌ నుంచి ఆరు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. విమానాశ్రయానికి బీచ్ కారిడార్, మెట్రోను అనుసంధానం చేసే పనులు ఉన్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విశాఖకు 55 కిలోమీటర్ల దూరంలో, అలానే విజయనగరానికి 25 కి.మీ., శ్రీకాకుళానికి 65 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సంగతి తెలిసిందే.