కోహ్లి, పంత్.. టీమిండియా ప్లేయర్లే టార్గెట్! వరుసగా వికెట్లు తీస్తున్న ఈ యంగ్ బౌలర్ ఎవరు?

Wait 5 sec.

లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ప్లేయర్లతో పాటు షాకిబుల్ గని, వైభవ్ సూర్యవంశీ వంటి జూనియర్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. సెంచరీలు నమోదు చేస్తున్నారు. తొలి రోజే 22 సెంచరీలు చేసిన బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. అయితే టోర్నీ జరుగుతున్నా కొద్దీ బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకుని . ఈ క్రమంలో విశాల్ జేస్వాల్ అనే మరో యంగ్ బౌలర్ పేరు చర్చనీయాంశమైంది. అతడు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి ప్లేయర్ల వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ప్లేయర్లే టార్గెట్‌గా బౌలింగ్ చేస్తున్నాడా అనేలా.. ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడి గురించి తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.బెంగళూరు వేదికగా గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఢిల్లీ. అయికే కేవలం ఒక పరుగుకే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యాను పెవిలియన్‌కు పంపించాడు బౌలర్ చింతన్ గాజా. అప్పుడొచ్చిన విశాల్ జేస్వాల్.. అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్పిత్ రాణాను (10) తక్కువ స్కోరుకు ఔట్ చేశాడు. ఈ క్రమంలో 77 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న విరాట్ కోహ్లిని.. అద్భతమైన బంతితో బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ సాయంతో స్టంపౌట్‌గా పెవిలియన్ పంపించాడు. అనంతరం నితీశ్ రాణాను కూడా (12) బోల్తా కొట్టించాడు. వరుసగా వికెట్లు పడడంతో కాస్త చూసుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న రిషభ్ పంత్‌ను (70) 44వ ఓవర్‌లో.. తన స్టన్నింగ్ బౌలింగ్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు విశాల్ జేస్వాల్. ఈ మ్యాచ్‌లో మొత్తం 42 పరుగులు సమర్పించుకుని 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇక డిసెంబర్ 24వ తేదీన జరిగిన మ్యాచ్‌లోనూ ఒక వికెట్ తీశాడు విశాల్. కాగా కోహ్లి, రిషభ్ పంత్‌లను ఔట్ చేయడంతో విశాల్ జేస్వాల్ గురించి తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. విశాల్ జేస్వాల్ ఎవరు?గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల విశాల్ జేస్వాల్.. డొమెస్టిక్ క్రికెట్‌లో అదే జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విశాల్.. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 12 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు మొత్తం 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 23.52 సగటుతో 40 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటి వరకు 5 (ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో) వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్‌గా రెడ్ బాల్ క్రికెట్‌లో ఓ సెంచరీతో పాటు అర్ధ సెంచరీ కూడా నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 2022లో ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించినప్పుడు.. తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విశాల్.