ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన భారత జట్టు 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఫైనల్‌లో తడబడి.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే కసితే అండర్ 19 వరల్డ్‌ కప్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన అండర్ 19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. అందులో హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జ్‌కు అవకాశం కల్పించారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఆరోన్ జార్జ్ ఎవరో తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతుకుతున్నారు క్రికెట్ అభిమానులు. ఆరోన్ జార్జ్‌ ఎవరు? ఆరోన్ జార్జ్ (19) కేరళలో పుట్టినప్పటికీ.. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అంతేకాకుండా.. జూనియ‌ర్ స్థాయి క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని తండ్రి ఈసో వర్గీస్ మావెలికరకు చెందిన వారు. తల్లి ప్రీతి కొట్టాయంకు చెందినవారు. జార్జ్‌కు చిన్నప్పటినుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు.. ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్‌తో ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడు జార్జ్. 2014 నుంచి 2017 వరకు హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో ఉచితంగా క్యాంప్‌కు హాజరయ్యేవాడు. ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న వాళ్లలో జార్జ్‌ చిన్నవాడు కావడం గమనార్హం.అలా సీనియర్లతో ఆడుతూ ఆటలో మెలకువలు నేర్చుకున్నాడు ఆరోన్ జార్జ్. 2023లో అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో బిహార్‌తో మ్యాచ్‌లో 303 పరుగుల చేసి అందరి కంట్లో పడ్డాడు. అనంతరం విజయవాడలో జరిగిన బీసీసీఐ హై పెర్ఫామెన్స్ క్యాంప్‌- విన్నూ మన్కడ్ ట్రోఫీలో.. ఢిల్లీతో మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. అలా అండర్-19 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. జార్జ్‌కు అద్భుత‌మైన బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. ప‌రిస్థితుల‌కు త‌గ్గట్టు ఆడగలడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయాల్లో గట్టెక్కించే సత్తా ఉంది. అయితే ఆరోన్ జార్జ్ బ్యాటింగ్ శైలి.. టీమిండియా వికెట్ కీప‌ర్ సంజు శాంస‌న్‌ను పోలి ఉంటుందని అంటారు. అరోన్.. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైద‌రాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. గత నెలలో అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా ఆరోన్ జార్జ్ వ్యవహరించాడు. కాగా, ఇటీవల అబుదాబి వేదికగా జరిగినలో రూ.30 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఆరోన్ జార్జ్‌పై ఎవరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. అండర్‌–19 వరల్డ్‌ కప్‌ టీమిండియా..ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, ఆరోన్‌ జార్జ్, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు, హర్‌వర్ధన్ సింగ్, ఆర్ఎస్ అంబ్రిష్, కనిష్క్‌ చౌహాన్, ఖిలాన్‌ ఏ పటేల్, హెనిల్‌ పటేల్, మొహమ్మద్‌ ఇనాన్, దీపేశ్, కిషన్‌ కుమార్‌ సింగ్, ఉధవ్‌ మోహన్‌.