Infosys: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేసినప్పుడే చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆయన సూచించారు. అప్పుడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చాలా మంది ఎక్కువ పని గంటలను తోసిపుచ్చారు. అయితే, తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో మరొకరైన ఎస్‌డీ శిబులాల్ విషయంపై మాట్లాడారు. శిబులాల్ మాత్రం ప్రతి వారం ఎక్కువ గంటలు పనిలో ఉండడం కన్నా చేసే పనిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ఎక్కువ సమయం పని చేయడం కన్నా ఆ పనిలో నాణ్యత చాలా ప్రధానమని తెలిపారు. ఇటీవలే ముంబైలో ఐఐఎంయూఎన్ నిర్వహించిన ఓ ప్రజా బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 70 గంటల పని దినాలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ' ప్రస్తుతం నేను ఇక్కడ కూర్చుని ఉన్నా. ఇక్కడే ఉండాలి తప్ప పరధ్యానంగా ఉండకూడదు. నా మొబైల్ ఫోన్‌లో నన్ను నేను పరధ్యానంలో ఉంచలేను. నేను మరో ఇతర ఆలోచనల తోనూ పరధ్యానంలో ఉండను. నా మైండ్‌లో ఉంది ఒకటే. ఎక్కువ సమయం గడిపే కన్నా పనిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ' అని ఆయన వెల్లడించారు. గతంలో 2014 వరకు మూడేళ్ల సమయం ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓగా ఎస్‌డీ శిబులాల్ పని చేశారు. సమయ పాలనలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు వారికి ఉంటాయని ఆయన తెలిపారు. వ్యక్తిగత, వృత్తిగత, ప్రజా జీవితం మధ్య సమయాన్ని కేటియించేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు. వారి వారి అవసరాల మేరకు ప్రాధాన్యతలు మారతాయని తెలిపారు. అయితే కేటాయించుకున్న సమయంలో మాత్రం అక్కడే 100 శాతం జీవించాలని సూచించారు. గతంలో వారినికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఆన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు, వీరి ఆలోచనలను చాలా మంది వ్యతిరేకించారు. తాజాగా ఇన్ఫోసిస్ లోనే మరో వ్యవస్థపక సభ్యులు శిబులాల్ సైతం వారి వ్యాఖ్యలను వ్యతిరేకించారు.