మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను.. ఎంత లాభానికి ఎంత.. లెక్కలు ఇవే

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి అవకాశంగా చెబుతారు. హైరిటర్న్స్ కోరుకునే వారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. నవంబర్ 2025 నాటికి మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం రూ.81 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సగటున 8 శాతం 10 శాతం లాభాలు అందిస్తే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ 12 శాతం నుంచి 15 శాతం మేర లాభాలు ఇచ్చాయి. దీంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఈ లాభాలపై ట్యాక్స్ కట్ అవుతుందని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులపై వచ్చే లాభాలను మూలధన లాభాలుగా పరిగణిస్తారు. దీంతో వాటిపై ఆదాయపు పన్ను విధిస్తారు. మ్యూచువల్ ఫండ్ పథకాల యూనిట్లను విక్రయించినప్పుడు (రిడంప్షన్), ఒక ఫండ్ నుంచి మరో ఫండ్ లోకి మారినప్పుడు వచ్చే లాభాలపై ఈ ట్యాక్స్ ఉంటుంది. అయితే, ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, స్కీమ్ లో కొనసాగినంత కాలం పన్ను ఉండదు. ఫండ్ కేటగిరీ, ఎంత కాలం తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు, అనే అంశాల ఆధారంగా వాటిపై వచ్చే రాబడులకు ట్యాక్స్ విధిస్తారు. కనీసం 65 శాతం నిధులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాటి నుంచి ఏడాది తర్వాత వెనక్కి తీసుకుంటే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. దీనిపై 12.5 శాతం ట్యాక్స్ పడుతుంది. అయితే, దీర్ఘకాలిక మూలధన లాభాల్లో ఏటా రూ.1.25 లక్షల వరకు పూర్తి మినహాయింపు పొందవచ్చు. మరోవైపు.. ఈక్విటీ పథకాల్లో ఏడాదిలోపు డబ్బులు విత్ డ్రా చేస్తే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాబాలుగా పరిగణనిస్తారు. మిగిలిన 35 నిధులను డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పథకాల్లో వచ్చే లాభాలను ఇన్వెస్టర్ల ఆదాయంలో కలిపి పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ విధిస్తారు. ఇక్కడ ఇన్వెస్టర్లు ఎంత కాలం పాటు కొనసాగారు అనేది లెక్కలోకి తీసుకోరు. మరోవైపు.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు IDCW ఆప్షన్ కింద అందుకునే ఎంఎఫ్ పథకాల డివిడెండ్ ఆదాయం పూర్తిగా ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ఈ ఆదాయాన్ని ఆయా ఇన్వెస్టర్ల వ్యక్తిగత ఆదాయానికి జోడించి వారి పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ విధిస్తారు.