మీ ITRలో తప్పులు ఉన్నాయా? సరిచేసేందుకు 3 రోజులే ఛాన్స్.. ఆ తర్వాత కుదరదు

Wait 5 sec.

: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వడ్డీ ఆదాయాన్ని చూపించడం మర్చిపోవడం, తప్పుడు డిడక్షన్లు క్లెయిమ్ చేయడం లేదా బ్యాంక్ ఖాతా వివరాలలో తప్పులు ఉండటం వంటివి చాలా మందికి ఎదురయ్యే సమస్యలు. అయితే, ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఒక చట్టబద్ధమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) సంబంధించి మీ సవరించిన రిటర్న్ (Revised ITR) అంటే ఏమిటి?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం పన్ను చెల్లింపుదారు తాను దాఖలు చేసిన అసలు రిటర్నులో ఏదైనా తప్పును లేదా విస్మరించిన అంశాన్ని గుర్తిస్తే, దానిని సరిచేస్తూ సవరించిన రిటర్న్ ను దాఖలు చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ అసలు రిటర్నును గడువులోపు (జూలై 31) దాఖలు చేసినా లేదా గడువు ముగిసిన తర్వాత () దాఖలు చేసినా డిసెంబర్ 31 లోపు దానిని ఎన్నిసార్లయినా సవరించుకోవచ్చు.సవరించిన రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు, ముందుగా దాఖలు చేసిన అసలు రిటర్న్ 15 అంకెల అకనాలెడ్జ్‌మెంట్ నంబర్, ఫైల్ చేసిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి, Tax Return సెక్షన్‌లో Revised Return ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు ఏ విభాగంలో తప్పు చేశారో (ఉదాహరణకు సెక్షన్ 80C డిడక్షన్లు లేదా ఇతర ఆదాయం) కేవలం ఆ వివరాలను మాత్రమే సరిచేసి, మిగిలిన డేటాను అలాగే ఉంచవచ్చు.డిసెంబర్ 31 గడువు దాటితే ఏమవుతుంది?కానీ, ఒకవేళ ఐటీ శాఖ మీ రిటర్నును ప్రాసెస్ చేసి, తప్పులను గుర్తిస్తూ నోటీసు పంపిన తర్వాత డిసెంబర్ 31 గడువు దాటిపోతే, మీరు సాధారణ పద్ధతిలో వేయలేరు. తప్పుడు సమాచారంతో రిటర్న్ ఉంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. డిసెంబర్ 31 తర్వాత తప్పులు సరిదిద్దుకోవాలంటే కేవలం 'అప్‌డేటెడ్ రిటర్న్' (Section 139(8A)) మాత్రమే వేయగలరు. కానీ దీనికి అదనంగా పన్ను పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది, దీని ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. కేవలం లెక్కల్లో తప్పులు ఉంటేనే రెక్టిఫికేషన్ అభ్యర్థన పెట్టుకోవచ్చు, కొత్త ఆదాయాన్ని కలపడానికి ఇది పనికిరాదు.ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసి ఉంటే, ఒకసారి మీ AIS (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్), ఫారం 26AS తో సరిపోల్చుకోండి. అందులో ఉన్న ఆదాయం మీ రిటర్నులో ఉందో లేదో చూసుకోండి. ఏదైనా తేడా ఉంటే వెంటనే ఈ నెలాఖరులోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయడం ద్వారా అదనపు జరిమానాలు, నోటీసుల బారి నుంచి తప్పించుకోవచ్చు. సమయం మించిపోకముందే మీ ఐటీఆర్‌ను సమీక్షించుకోండి. డిసెంబర్ 31 తర్వాత మీ చేతులు దాటిపోయే అవకాశం ఉన్నందున, ఈ రోజే మీ ఆడిటర్ లేదా ట్యాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోండి.