ఆర్ఎస్ఎస్‌‌‌కు ప్రశంసలపై తీవ్ర చర్చ.. క్లారిటీ ఇచ్చిన డిగ్గీ రాజా

Wait 5 sec.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ()పైకురిపిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్‌ రాజకీయ వర్గాలు ముఖ్యంగా హస్తం పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో తన పోస్ట్‌పై డిగ్గీ రాజా వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను తాను వ్యతిరేకిస్తానని మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్థాగత ఎదుగుదలను ప్రశంసిస్తూ ఆయన షేర్ చేసిన ఫోటో కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలను బయటపెట్టిందనే ఊహాగానాలు దారితీసింది. దీంతో దిగ్విజయ్ సింగ్ తాను ఎల్లప్పుడూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతానని తేల్చిచెప్పారు.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు.. ఎల్కే అద్వానీతో 1996లో ప్రధాని మోదీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇది చాలా ప్రభావవంతంగా ఉంది.ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగిన తీరు సంస్థాగత శక్తిని ప్రతిబింబిస్తుంది’ అని సింగ్ పోస్ట్ చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఆయన ట్యాగ్ చేయడంతో అధిష్ఠానంపై పరోక్షంగా డిగ్గీ విమర్శలు చేశారనే ఊహాగానాలకు దారితీసింది. ఆయన పోస్ట్‌పై పలువురు బీజేపీ నాయకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీపై ‘బహిరంగ అసమ్మతి’ అంటూ విమర్శించారు.వివాదం తాజాగా దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘ఒక విషయాన్ని అర్థం చేసుకోండి - నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అసెంబ్లీలో లేదా పార్లమెంటులో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ మతతత్వ శక్తులతో పోరాడాను.. నేను వారి (ఆర్ఎస్ఎస్-బీజేపీ) సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను. కానీ ప్రతి సంస్థకు బలోపేతం అవసరం’’ అన్నారు. గాంధీ హంతకుల నుంచి తానేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ నాథూరామ్ గాడ్సేతో ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని ప్రస్తావించారు.ఇక, తన పోస్ట్ కాంగ్రెస్‌లో ఎవరికీ సలహా ఇవ్వడానికి ఉద్దేశించినది కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగత సామర్థ్యం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాలా? అన్న ప్రశ్నకు డిగ్గీ రాజా బదులిస్తూ ‘సంస్థాగత శక్తి ఎంత గొప్పదంటే, వారు ఇంటింటికీ వెళ్లి బట్టతల వారికి దువ్వెన అమ్మగలరు. వారు ఈ విషయంలో చాలా తెలివైనవారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కూడా అదే విధమైన నిబద్ధత మాకు కావాలి’ అని అన్నారు.అయితే, ఒక వారం కిందట కాంగ్రెస్‌లో సంస్థాగత సంస్కరణలకు దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. మరింత వికేంద్రీకృత, ఆచరణాత్మక పార్టీ నిర్మాణాన్ని ఆయన సమర్థించారు. ‘ఒక సమస్య ఏమిటంటే మిమ్మల్ని ఒప్పించడం అంత సులభం కాదు’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి సింగ్ ఓ పోస్ట్ పెట్టారు.