యాషెస్ సిరీస్ 2025-26లో నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగింది. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. దీంతో వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ జట్టు.. ఈ . ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. పరువు కోసం ఆడిన నాలుగో టెస్టులో మొత్తానికి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో ఘటన జరిగింది. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్‌ను ఆస్ట్రేలియా అభిమానులు ఆడుకున్నారు. మ్యాచ్‌ జరగంగానే స్లెడ్జింగ్ చేశారు. దీనికి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు ఇంగ్లీష్ ప్లేయర్. బీర్ కావాలా.. డకెట్..శనివారం (డిసెంబర్ 27) జరిగిన నాలుగో యాషెస్ టెస్టు రెండో రోజు.. బెన్ డకెట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక ఆస్ట్రేలియా అభిమాని ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను "నీకు బీర్ కావాలా?" అని అడుగుతూ ఆటపట్టించాడు. డకెట్ అతడికి దీటుగా బదులిచ్చాడు. ఆ మాటను డకెట్ స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. థమ్స్‌ అప్ సింబల్ చూపించాడు. దీంతో డకెట్ స్పోర్టివ్‌‌నెస్‌ను అక్కడున్న ప్రేక్షకుల గ్యాలరీలోని అభిమానులు అభినందించారు.కాగా, ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టు తర్వతా రిసార్ట్ పట్టణం నూసాలో విరామం తీసుకుంది. ఆ సమయంలో బెన్ డకెట్ మద్యం సేవించి.. హోటల్‌కు తిరిగి వెళ్లే దారిని కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఫ్యాన్ ఈ మేరకు బెన్ డకెట్‌ను ఎగతాళి చేశాడు. కాగా, ఈ విషయంలో యాషెస్ పర్యటనలో ఉన్న బెడన్ డకెట్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టనుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారు ఎక్కువ మోతాదులో మద్యం సేవించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్ టీమ్ ఎండీ రాబ్ కీ స్పందించాడు. ఈ విషయంలో దర్యాప్తు చేస్తామని తెలిపాడు. మరోవైపు, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడం గమానార్హం. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు కూడా ఇలాగే రెండు రోజులు మాత్రమే సాగింది. అందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓడిపోగా, మెల్‌బోర్న్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా పిచ్‌లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆస్ట్రేలియాలో పిచ్‌లకు ఇచ్చే రేటింగ్‌ల్లో ద్వంద్వ వైఖరి ఉందని, మ్యాచ్ రిఫరీ మారితే రేటింగ్ కూడా మారే అవకాశం ఉందని వ్యంగ్యంగా స్పందించాడు. భారత గ్రౌండ్స్‌మెన్లపై వచ్చే విమర్శలను కూడా గవాస్కర్ ప్రస్తావించారు.