కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉరిశిక్ష పడేవరకు పోరాడుతా.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు శపథం

Wait 5 sec.

ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరగాలంటే ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉరిశిక్ష పడాలని ఆమె పట్టుబట్టింది. అప్పటివరకు తాను చేస్తున్న పోరాటం ఆపనని బాధితురాలు శపథం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి పక్కన పెట్టింది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా బాధితురాలు, ఆమె తల్లి వ్యాఖ్యలుతన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు వెల్లడించింది. కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉరిశిక్ష పడే వరకు తాను విశ్రమించనని.. అప్పుడే తనకు, తన తండ్రికి నిజమైన న్యాయం జరుగుతుందని బాధితురాలు పేర్కొంది. సెంగార్ శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఆమె తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక రేపిస్ట్‌కు బెయిల్ ఇవ్వాలని జడ్జికి ఎలా అనిపించిందో అని ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తన కేసును అత్యవసరంగా విచారించినందుకు ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లి కృతజ్ఞతలు తెలిపారు.సుప్రీంకోర్టు స్టే విధింపు విడుదలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందించాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. అతనికి సమాధానం ఇవ్వడానికి 4 వారాల సమయం ఇచ్చింది. బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్ష అనుభవిస్తున్నందున.. అతడు ప్రస్తుతానికి జైలులోనే ఉండనున్నాడు.ఉన్నావ్ అత్యాచార కేసు నేపథ్యం ఏంటి?2017లో జరిగిన ఈ దారుణమైన కేసులో ట్రయల్ కోర్టు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు విధించింది. అయితే ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను నిలిపివేస్తూ సెంగార్ పబ్లిక్ సర్వెంట్ కాదని, పోక్సో (POCSO) చట్టం వర్తించదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో గత వారం ఢిల్లీలో బాధితురాలు, ఆమె తల్లిపై భద్రతా బలగాలు ప్రవర్తించిన తీరుపై కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. వారిని నిరసన తెలపకుండా అడ్డుకోవడం, బస్సు నుంచి తోసివేయడం వంటి వీడియోలు వైరల్ కావడం తీవ్ర ఆందోళన రేకెత్తించాయి.