ఏపీలో 28కి పెరిగిన జిల్లాల సంఖ్య.. ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం.. కేబినెట్‍లో ఏడ్చేసిన మంత్రి..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. , మదనపల్లె, జిల్లాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే జిల్లాల పునర్విభజన ప్రతిపాదనల చర్చించారు. అనంతరం ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. అలాగే రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లాలో చేర్చనున్నారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చనున్నారు. వీటితో పాటుగా తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరులో కలపాలనే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ ఆమోదం నేపథ్యంలో ఫైనల్ నోటిఫికేషన్ డిసెంబర్ 31న విడుదల కానుంది.మంత్రివర్గ భేటీలో ఏడ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిమరోవైపు మంత్రివర్గ సమావేశం సందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కేంద్రంగా ఉన్న రాయచోటిని.. తాజాగా మదనపల్లె జిల్లాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో మంత్రి మండిపల్లి కన్నీరు పెట్టుకోగా.. చంద్రబాబు ఓదార్చారు. రాయచోటి అభివృద్ధి మీద మంత్రికి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం మార్చకపోతే వచ్చే.. సాంకేతికపరమైన ఇబ్బందులను వివరించారు. రాయచోటిలో ఆందోళనలు..మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు ఇందులో పాల్గొంటున్నారు. సోమవారం రోజున భారీ ర్యాలీ చేపట్టడంతో పాటుగా మానవహారం ఏర్పాటు చేశారు. మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అని నినాదాలు చేశారు. వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి అభివృద్ధి చెందాలంటే.. జిల్లా కేంద్రంగానే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.