హ్యాట్సాఫ్ డిప్యూటీ సీఎం సార్.. నిన్న నాని, నేడు సింధు.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం పనితీరుపై ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రశంసలు కురిపించారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. ప్రశంసలు కురిపించిన పీవీ సింధు.. వీటి నిర్మాణం ద్వారా నెలకొంటోందని అన్నారు. ఇలాంటి మరెన్నో వినూత్న కార్యక్రమాలు తీసుకురావాలని పీవీ సింధు ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేశారు. "డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. అని కొత్త ఇనిషియేటివ్ తీసుకువచ్చారు. గ్రామాల్లో డ్రెనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమస్యకు పరిష్కారంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రెయిన్లు అనే వినూత్న ఆలోచన చేశారు. మ్యాజిక్ డ్రెయిన్ల కారణంగా వ్యర్థంగా వెళ్లే నీళ్లు వడపోతకు గురై.. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అలాగే మురికినీరు రోడ్లుపైకి రావటం, వాసన రావటం వంటి సమస్యలు తగ్గుతాయి. హ్యాట్సాఫ్ డిప్యూటీ సీఎం సర్. ఇంకా ముందు ముందు ఇలాంటి కొత్త కార్యక్రమాలు మరెన్నో వస్తాయి. మన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడింది. మరింత బాగుపడాలని కోరుకుంటున్నా.. " అంటూ పీవీ సింధు వీడియో విడుదల చేశారు. మరోవైపు అపరిశుభ్రతను తొలగించి, భూగర్భ జలాలను పెంచటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మ్యాజిక్ డ్రెయిన్లు ప్రాజెక్టు చేపట్టింది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ సమర్థవంతంగా పనిచేసే ఈ ఇంకుడు కాలువల వ్యవస్థను ఇప్పటికే పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మంచి ఫలితాలు కనిపించటంతో రాష్ట్రవ్యాప్తంగా వీటి నిర్మాణం చేపడుతున్నారు. మ్యాజిక్ డ్రెయిన్లు సాధారణ సిమెంట్ కాలువల కంటే తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. ఇళ్ల నుంచి విడుదలయ్యే వ్యర్థపు నీరు ఇందులోకి వెళ్తూ.. ఇంకుడు గుంతలుగా పనిచేస్తూ, భూగర్భ జలాలను కూడా పెంచుతాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రశంసించిన సంగతి తెలిసిందే. చెత్తరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని.. ఇళ్ల నుంచి చెత్త, పనికిరాని వస్తువులను సేకరిస్తూ వాటికి బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయని.. ఆ రకంగా చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాములు అవుతున్నారని నాని కొనియాడారు.