Tax Deadlines: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండో నెలలోకి అడుగుపెడుతున్నాం. పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక వ్యవహాహాలను చక్కదిద్దుకోవడానికి మే నెల చాలా కీలకంగా చెబుతారు. మూలం వద్ద పన్ను చెల్పింపులు (TDS) నుంచి త్రైమాసిక ట్యాక్స్ ఫైలింగ్స్ వరకు ఈ మే నెలలో పలు గడువు తేదీలు ఉన్నాయి. వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే భారీ జరిమానాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.మే నెలలో ముఖ్యమైన తేదీలు ఇవేఏప్రిల్ 2026 నెలలో వసూలు చేసిన టీడీఎస్, టీసీఎస్ మొత్తాలను కేంద్ర ప్రభుత్వానికి జమ చేసేందుకు మే7వ తేదీ ఆఖరు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేందుకు గడువు ఇదే.మే 15వ తేదీ నాటికి పలు కీలకమైన డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 2026లో ఆస్తుల కొనుగోలు, ఇంటి అద్దె, కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులపై కోత విధించిన పన్నులకు సంబంధించిన సర్టిఫికెట్లను జారీ చేసేందుకు మే 15 లాస్ట్ తేదీ. మార్చి 31, 2026 తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన టీసీఎస్ స్టేట్మెంట్ ఫైల్ చేసేందుకు మే 15 లాస్ట్. చలానా లేకుండా టీడీఎస్ జమ చేసిన ప్రభుత్వ సంస్థలు ఈ ఫారమ్ సమర్పించిందేందుకు మార్చి 15 చివరి తేదీ. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు మే 30 ఆఖరు తేదీసినిమా నిర్మాణం లేదా సంబంధిత రంగాల్లో ఉన్నవారు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక స్టేట్మెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మే నెల చివరి రోజైన 31వ తేదీ పన్ను చెల్లింపుదారులకు అత్యంత బిజిగా ఉండే రోజు ఇది. జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నివేదికను సమర్పించాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉండి కూడా ఇప్పటి వరకు పాన్ లేని వారు, అలాగే కంపెనీ డైరెక్టర్లు, ట్రస్టీలు ఈ తేదీలోపు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు తాము పొందిన విరాళాలకు సంబంధించిన దాతలకు ఫారమ్ 10బీఈ సర్టిఫికేట్లను జారీ చేయాలి.చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఉండాలంటే ఈ తేదీలను క్యాలెండర్ లో మార్క్ చేసుకోవడం మంచిది. సరైన ప్లానింగ్ తో పన్ను బాధ్యతలను నెరవేర్చడం వల్ల జరిమానాల నుంచి తప్పించుకోవడమే కాకుండా మన ఆర్థిక స్థితిగతులపై స్పష్టత వస్తుంది. పన్ను నిబంధనల్లో ఏవైనా సందేహాలు ఉంటే మీ ట్యాక్స్ కన్సల్టెంట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.