పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించాలనే ఆశయం నెరవేరింది. కోటను గెలిచేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. 2021లో విజయానికి చేరువైంది. కానీ దీదీ వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. కానీ ఈసారి మరింత పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లిన కమలం పార్టీ.. బెంగాల్‌ గడ్డపై కాషాయ జెండాను ఎగరేసింది. ఈ విజయంతో బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బెంగాల్‌లో బీజేపీ గెలవడం వల్ల పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌పై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉంది.బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు వెంబడి కంచె నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య 2 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉంది. అయితే సరిహద్దుల్లో చాలా ప్రాంతం నదులు, చిత్తడి నేలలు, జనావాసాల గుండా వెళ్తుంది. దీంతో ఇప్పటికీ 450 కి.మీ. మేర సరిహద్దు కంచె వేయాల్సి ఉంది. తాము అధికారంలోకి వచ్చాక సరిహద్దు నిర్మాణాన్ని యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే కంచె నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ కంచె నిర్మాణం పూర్తయితే.. బెంగాల్‌లోకి అక్రమ వలసలతోపాటు స్మగ్లింగ్‌ను సైతం అరికట్టేందుకు వీలవుతుంది.Read Also: బంగ్లాదేశ్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వలసదారులు బెంగాల్‌లోకి ప్రవేశిస్తున్నారని బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పెద్ద సంఖ్యలో ముస్లింలు బెంగాల్‌లో స్థిరపడ్డారని కూడా చెబుతారు. అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి వెనక్కి పంపడానికి బీజేపీ ప్రయత్నించొచ్చు. ఎందుకంటే బీజేపీ తన మేనిఫెస్టోలో డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అదే జరిగితే బంగ్లాదేశ్‌కు తిరుగు వలసలు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. ఈ విషయమై ఇప్పటికే బంగ్లాదేశ్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.Read Also: ఈ రెండు అంశాలు బంగ్లాదేశ్‌పై ప్రతికూలంగా ప్రభావం చూపే అవకాశం ఉండగా.. ఒక సానుకూల పరిణామం సైతం చోటు చేసుకునే అవకాశం ఉంది. అదే తీస్తా జలాల పంపిణీ సమస్య పరిష్కారం. తీస్తా నదీ జలాల ఒప్పందాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో.. కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఇది పెండింగ్‌లో ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. బంగ్లాదేశ్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడం కోసం ఈ ఒప్పందాన్ని అమలు చేసే అవకాశం ఉంది. హిమాలయాల్లో జన్మించే తీస్తా నది.. సిక్కిం, బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించి అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 414 కి.మీ. కాగా.. బంగ్లాదేశ్‌లో 121 కి.మీ. ఉంది. 2011లోనే మన్మోహన్ సర్కారు భారత్‌కు 42.5%, బంగ్లాకు 37.5 శాతం తీస్తా జలాలను కేటాయించేలా పొరుగుదేశంతో ఒప్పందం చేసుకోవాలని అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్‌కు ఎక్కువ నీరు ఇవ్వడానికి మమత నిరాకరించడంతో.. ఈ ఒప్పందం పెండింగ్‌లో ఉంది.పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలును వేగవంతం చేసే అవకాశం ఉంది. దీని వల్ల బంగ్లాదేశ్‌లో ఇబ్బందులు పడుతున్న హిందువులకు భారత పౌరసత్వం లభిస్తుంది. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు పెరిగాయి. భవిష్యత్తులు ఇలాంటి దాడులు జరిగితే బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఒత్తిడి పెరగొచ్చు. సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాలు పూర్తిగా నిలిచేపోయే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే.. బంగ్లాదేశ్‌లో భారత్ పట్ల వ్యతిరేకత పెరగడంతోపాటు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశ ఉంది.