ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆనుకుని సరిహద్దులలో ఉన్న నియోజకవర్గాలలో దళపతి విజయ్‌కు చెందిన టీవీకే హవా కనిపించింది. ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా పొన్నేరి, గుమ్మడిపూండి, తిరువళ్లూరు, కృష్ణగిరి, అరక్కోణం, కంచి, వెల్లూరు, గుడియాట్టం, కేవీ కుప్పం నియోజకవర్గాలలో టీవీకే అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. అలాగే . మరోవైపు తమిళనాడు అసెంబ్లీ సామర్థ్యం 234 స్థానాలు కాగా.. విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంది. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కాగా..విజయ్ టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు కనీసం 10 నుంచి 12 సీట్లు దూరంలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తదుపరి వ్యూహమేంటనేదీ ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి74, అన్నాడీఎంకే కూటమి 53 వరకూ సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకేను స్థాపించిన విజయ్.. ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తారనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే పార్టీలతోనూ సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, పీఎంకే చెరో ఐదు స్థానాల్లో గెలుపొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే లెఫ్ట్ పార్టీలు రెండు సీట్లలో విజయం సాధించవచ్చని ట్రెండ్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా.. కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలు కూడా నెలకొన్నాయి. దీనికి తోడు విజయ్‌కు మద్దతుగా నిలవాలంటూ ఆయన తండ్రి చంద్రశేఖర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కోరారు. అలాగే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా విజయ్‌కు ఫోన్ చేసి అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పొత్తు నుంచి కాంగ్రెస్, అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే బయటకు వచ్చి విజయ్ పార్టీకి మద్దతిస్తాయా.. విజయ్ తదుపరి అడుగులు ఎటువైపు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.