అనకాపల్లి మిట్టల్ స్టీల్స్‌లో యువతకు ఉద్యోగాలు.. రూ.8.50 లక్షల వార్షిక ప్యాకేజీతో.. శంకుస్థాపన చేసిన నెలకే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ కంపెనీలతో పాటుగా రాష్ట్రానికి పరిశ్రమల్ని ఆహ్వానిస్తోంది. రాష్ట్రానికి వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి.. ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ వంటి కంపెనీలకు శంకుస్థాపన కూడా చేశారు. మార్చి నెలలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయగా.. ముందే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన నెలరోజుల్లోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించి 54మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. గతంలో ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పరుగులు తీసిన యువతకు ఇప్పుడు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి.ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహించగా.. కాకినాడ జేఎన్టీయూ నుంచి 200 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. వీరిలో 60మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా.. చివరికి 17 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మిట్టల్ సంస్థ ఒక్కొక్కరికి రూ.8.50 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీ ఇస్తోంది. అలాగే కాకినాడ సూరపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో నుంచి మరో 11మంది రూ.6.70 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్శిటీలో ఇటీవల నిప్పన్‌ స్టీల్స్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా ఏయూ, మరికొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి 26 మందికి రూ.6.70 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయి.ముుఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తుంటే పనులు పూర్తిచేసిన తర్వాతే ఉద్యోగాల్లోకి తీసుకుటుంది. కానీ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం మాత్రం ముందుగానే ఉద్యోగాల నియామకంపై ఫోకస్ చేపట్టింది. కొంతమందిని క్యాంపస్ ఇంట్వర్యూల ద్వారా రిక్రూట్‌ చేయగా.. మరికొందరికి స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన విధంగా శిక్షణ అందించాలని భావిస్తున్నారు. ఈ శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది మిట్టల్ ఉక్కు పరిశ్రమ యాజమాన్యం.అంతేకాదు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వం ఐటీఐకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎం సేతు (ప్రధానమంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబులిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐ)లో భాగంగా యాంకర్‌ ఇండస్ట్రీగా మిట్టల్ స్టీల్స్‌ను ఐటీఐకి అనుసంధానం చేశారు. అప్పుడు ఐటీఐలో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.. ఐటీఐలో కోర్సులు పూర్తిచేసిన వారికి మిట్టల్ స్టీల్స్‌లో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెబుతున్నాయి. మొత్తం మీద మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాకతో రాష్ట్ర యువతకు ముందుగానే ఉద్యోగ అవకాశాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరికొందరికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అంటున్నారు.